Groundnut Cultivation : వేరుశనగ సాగుకు ముందుగా విత్తనశుద్ధిలో యాజమాన్య పద్ధతులు!

వరి మాగాణుల్లో లేదంటే కొత్తగా వేరు శనగ సాగు చేస్తుంటే కిలో విత్తనానికి 200గ్రా రైజోబియం కల్చరుని పట్టించాలి. విత్తనాన్ని మొదట శిలీంధ్రనాశినితో శుద్ధిచేసి, ఆరబెట్టిన తరువాత క్రిమి సంహారక మందుతో శుద్ధి చేయాలి. ఆతరువాత అవసరమైతే రైజోబియం కల్చరును విత్తనాలకు పట్టించవచ్చు.

Groundnut Cultivation : వేరుశనగ సాగుకు ముందుగా విత్తనశుద్ధిలో యాజమాన్య పద్ధతులు!

Groundnut-cultivation

Groundnut Cultivation : తెలుగు రాష్ట్రాల్లో వేరుశనగను రైతులు విస్తృత స్ధాయిలో రైతులు సాగు చేస్తున్నారు. తేలికపాటి నేలలు ఈ పంటకు ఇసుకతో కూడిన గరపనేలలు, నీరు త్వరగా ఇంకే ఎర్ర చల్కా నేలలు వేరుశనగ సాగుకు అనుకూలంగా ఉంటాయి. వేరుశనగ వేయాలని నిర్ణయం తీసుకుని పంట సాగు చేసే ప్రయత్నాల్లో ఉంటే విత్తనశుద్ధి అనేది చాలా ముఖ్యమైనది. ఈ విషయంపై రైతులు సరైన అవగాహన కలిగి ఉండే పంటను చీడపీడల నుండి రక్షించుకొవటం ద్వారా మంచి దిగుబడులు పొందవచ్చు.

వేరుశనగలో విత్తన శుద్ధి ; కిలో విత్తనానికి 1.0గ్రా టిబ్యుకొనజోల్ , 3గ్రా మ్యంకోజెబ్ పొడి మందును పట్టించాలి. కాండం కుళ్ళు వైరస్ తెగులు ఆశించే ప్రాంతాల్లో కిలో విత్తనానికి 2 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తనశుద్ధి చేయాలి. వేరు పురుగు ఉధృతి ఎక్కువగా ఉండే ప్రాంతమైతే కిలో విత్తనానికి 6.5 మి.లీ క్లోరిఫైరిఫాస్ లేక 2 మి.లీ ఇమిడా క్లోప్రిడ్ చొప్పున కలిపి శుద్ధి చేయాలి.

వరి మాగాణుల్లో లేదంటే కొత్తగా వేరు శనగ సాగు చేస్తుంటే కిలో విత్తనానికి 200గ్రా రైజోబియం కల్చరుని పట్టించాలి. విత్తనాన్ని మొదట శిలీంధ్రనాశినితో శుద్ధిచేసి, ఆరబెట్టిన తరువాత క్రిమి సంహారక మందుతో శుద్ధి చేయాలి. ఆతరువాత అవసరమైతే రైజోబియం కల్చరును విత్తనాలకు పట్టించవచ్చు. వేరుకుళ్లు , మొదలు కుళ్లు, కాండం కుళ్లు తెగుళ్లు ఎక్కువగా ఆశించే పరిస్ధితుల్లో కిలో విత్తనానికి 10 గ్రా ట్రైకోడెర్మా విరిడిని పట్టించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

రబీలో నీటి పారుదల కింద సాగు చేసే టప్పుడు 22.5 నుండి 10 సెం.మీ దూరంలో విత్తుకోవాలి. విత్తనాన్ని గొర్రుతో గానీ లేక నాగలి తోకాని , ట్రాక్టరుతో నడిచే యంత్రంతో విత్తుకోవాలి. విత్తే సమయంలో నేలలో తగిననంత తేమ ఉండేలా చూడాలి. విత్తనాన్ని 5 సెం.మీ లోతు మించకుండా విత్తుకోవాలి. ట్రాక్టరు డ్రిల్ ను వాడితే తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకోవచ్చు. తద్వారా ఖర్చును కూడా గణనీయంగా తగ్గించుకోవచ్చు.