Turmeric Cultivation : పసుపు సాగులో విత్తనశుద్ధి, పోషక ఎరువుల విషయంలో యాజమాన్య పద్ధతులు!

పోషక ఎరువులు, పంట వేసుకునే ముందు పశువుల ఎరువు ఎకరానికి 10-15 టన్నుల వేసుకొని దుక్కి చేసుకోవాలి. పశువుల ఎరువు వెయ్యలేకపోతే చివరి దుక్కిలో ఎకరానికి 200 కిలోల వేపపిండి మరియు కానుగ పిండి లేదా 200 కిలోల సూపర్ ఫాస్ఫేట్ మరియు ఆముదం పిండి కలుపుకోవాలి.

Turmeric Cultivation : పసుపు సాగులో విత్తనశుద్ధి, పోషక ఎరువుల విషయంలో యాజమాన్య పద్ధతులు!

Turmeric Farming

Turmeric Cultivation : పసుపు దుంపజాతి మొక్క. పచ్చ బంగారంగా పిలువబడే పసుపు పంటను కొద్ది మంది రైతులే సాగు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పంట సాగవుతుంది. పసుపు పండించే రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులతోపాటు, అధిక లాభాలు గడించవచ్చు. పంట వేసే ముందే రైతులు దీని సాగుపై అవగాహన కలిగి ఉండటం తప్పని సరి.

పసుపు పంట కోసం ఎంచుకున్న భూమిని లోతుగా దున్నుకోవాలి ఇలా దున్నుకోవడం వల్ల నేల వదులుగామారి పసుపుగడ్డ ఉరడానికి అనువుగా ఉంటుంది. అలాగే కలుపు విత్తనం చాలావరకు నాశనం అవుతుంది. ఒకేనేలలో వరుస రెండు పంటలు వేయకూడదు. పంట మార్పిడి పద్ధతిని పాటించాలి. పసుపు విత్తన శుద్ధి పాటించకపోవడం వల్ల పంట దిగుబడిలో చాల వరకు కోల్పోవడం జరుగుతుంది. విత్తనశుద్ధి చెయ్యడం వలన దుంప కుళ్ళు తెగులు బారి నుండి పంటను రక్షించుకోవచ్చు.

పసుపులో విత్తన శుద్ధి, ఎరువులు ;

విత్తన శుద్ధి చేసే విధానం విత్తనం వేసే ముందు డైమితోయేట్ 2 మీ.లీ / 1 లీటర్ నీటికి లేదా మోనోక్రోటోఫాస్ 1.5 మీ.లీ / 1 లీటర్ నీటికి కలుపుకొని 30 నిమిషాలపాటు ఈ ద్రావణంలో పసుపు దుంపలను ఉంచిన తరువాత విత్తుకోవాలి.

పోషక ఎరువులు, పంట వేసుకునే ముందు పశువుల ఎరువు ఎకరానికి 10-15 టన్నుల వేసుకొని దుక్కి చేసుకోవాలి. పశువుల ఎరువు వెయ్యలేకపోతే చివరి దుక్కిలో ఎకరానికి 200 కిలోల వేపపిండి మరియు కానుగ పిండి లేదా 200 కిలోల సూపర్ ఫాస్ఫేట్ మరియు ఆముదం పిండి కలుపుకోవాలి. చివరి దుక్కిలో జింక్ సాల్ఫేట్ వేసుకోవాలి. పసుపు నాటుకున్న 35 40 రోజుల మధ్య ఎకరానికి 50 కిలోల యూరియ మరియు 200 కిలోల వేపపిండి రెండు కలుపుకొని వాడుకోవాలి.

కలుపు నివారణ చర్యలు ;

పంట వేసే ముందు వేసవిలో లోతుగా దున్నుకోవాలి ఇలా దున్నుకోవడం వల్ల కలుపు విత్తనం చాల వరకు నాశనం అవుతాయి. విత్తనం నాటిన మరుసటి రోజు అట్రజిన్ ౩ గ్రా” / 1 లీటర్నీ టికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. విత్తనం వేసిన 16-18 రోజుల తరువాత మొలకెత్తుతాయి కావున విత్తిన 7-8 రోజులలోపు పండ్లగోర్రుతో పైపాటుగా తిప్పాలి.