Sajja Crop Cultivation : సజ్జపంట సాగులో అనువైన విత్తన రకాలు , రైతులు అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులు!

హైబ్రీడ్ పాటు ప్రాచుర్యంలో ఉన్న ప్రైవేటు రకాలను సైతం సజ్జసాగుకు ఎంపిక చేసుకోవచ్చు. విత్తన రకాల కు సంబంధించి పీహెచ్ బి 3 ఇది ఖరీఫ్ , వేసవిలో సాగుకు అనుకూలంగా ఉంటుంది. పంటకాలం 85 రోజులు, వెర్రకంకి తెగులు, బెట్టను తట్టుకుంటుంది.

Sajja Crop Cultivation : సజ్జపంట సాగులో అనువైన విత్తన రకాలు , రైతులు అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులు!

Types of seeds suitable for cultivation of Sajjapanta, management practices to be followed by farmers!

Sajja Crop Cultivation : సజ్జ వంటను ఖరీవ్‌లో వర్షాలు ఆలస్య మైన సమయంలో ఆగష్టు రెండవ వక్షం వరకు ఒక ప్రత్యామ్నాయ వంటగా విత్తుకొని మంచి దిగుబడులు సాధించవచ్చును. వర్షాధారంగా ఖరీఫ్‌లో జూన్‌ మొదటి పక్షం నుంచి జూలై రెందో వక్షం వరకు విత్తుకోవచ్చును. వేసవిలో ఆరుతడి వంటగా ఫిబ్రవరి రెండవ వక్షం లోపు విత్తు కోవాలి
తేలికపాటి నుండి మధ్య రకం నేలలు మరియు నీరు ఇంకే మురుగు నీటి పారుదల గల నేలలు ఈ వంట సాగుకు అనుకూలంగా ఉంటాయి.

విత్తన రకాల ఎంపిక : హైబ్రీడ్ పాటు ప్రాచుర్యంలో ఉన్న ప్రైవేటు రకాలను సైతం సజ్జసాగుకు ఎంపిక చేసుకోవచ్చు. విత్తన రకాల కు సంబంధించి పీహెచ్ బి 3 ఇది ఖరీఫ్ , వేసవిలో సాగుకు అనుకూలంగా ఉంటుంది. పంటకాలం 85 రోజులు, వెర్రకంకి తెగులు, బెట్టను తట్టుకుంటుంది. ఎకరానికి 12 క్వింటాళ్ల దిగుబడిని ఇస్తుంది. హెచ్ హెచ్ బి 67 రకం ఇది ఖరీఫ్, వేసవిలో సాగుకు అనుకూలమైనది. పంటకాలం 70 రోజులు అతి తక్కువ కాలంలో కోతకు వచ్చే హైబ్రీడ్ రకం. వెర్రికంకి తెగులు తట్టుకుంటుంది. ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఐసిఎమ్ హెచ్ 356 రకం ఇది ఖరీఫ్, వేసవిలో సాగుకు అనుకూలమైనది. పంటకాలం 85 రోజులు, గింజలు మధ్యస్ధంగా ఉంటాయి. వెర్రి కంకి తెగులును తట్టుకుంటుంది. ఐసిటిపి 8203 రకం ఇది ఖరీఫ్, వేసవిలో సాగుకు అనుకూలమైనది. పంటకాలం 85 రోజులు, గింజలు లావుగా ఉంటాయి. వెర్రి కంకి తెగులు తట్టుకుంటుంది.

విత్తన మోతాదు : ఎకరానికి 1.5-2.0 కిలోలు విత్తనం అవసరమౌతుంది. కిలో విత్తనానికి 6గ్రా. మెటలాక్సిల్‌ 35ఎన్‌.డి. తో విత్తనశుద్ధి చేసి పచ్చ కంకి వెర్రి తెగులును నివారించ వచ్చును. కిలో విత్తనానికి ౩ గ్రా. థైరమ్‌ తో విత్తన శుద్ధి చేసుకోవాలి. వరుసల మధ్య 45 సెం.మీ. మొక్కల మధ్య 12-15 సెం.మీ. దూరం ఉండేటట్లు గొర్రుతో విత్తుకోవాలి.

ఎరువులు : ఎకరానికి 3-4 టన్నుల పశువుల ఎరువును ఆఖరు దుక్కిలో వేసి కలియదున్నాలి. వర్షాధారంగా సాగు చేసినవుడు ఎకరాకు 24 కిలోల నత్రజని, 12 కిలోల భాన్వరం మరియు 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. నీటి పారుదల పంటకు ఎకరానికి 36 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం మరియు 16 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేయాలి. నత్రజని విత్తేటప్పుడు సగం, మిగతా భాగం 30 రోజుల దశలో వేయాలి.