Guava Farming : జామలో నులిపురుగులను అరికట్టే పద్ధతులు

జామతోటలకు  ప్రాణాంతకంగా  మారిన నెమటోడ్స్  నివారణకు  చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Guava Farming : జామలో నులిపురుగులను అరికట్టే పద్ధతులు

Methods of controlling nematodes in guava

Guava Farming : ఇటీవలికాలంలో  జామతోటల  రైతులు ఎదుర్కుంటున్న  ప్రధాన సమస్య నులిపురుగులు . వీటిని నెమటోడ్స్  అంటారు . వీటి బెడదతో మొక్కలు నిలువునా ఎండిపోతుండటంతో  చాలా ప్రాంతాల్లో తోటలను తీసేసే పరిస్థితి నెలకొంది . ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో హెడెన్సిటీ విధానంలో సాగవుతున్న జామతోటల్లో  ఈ నులిపురుగుల  నష్టాన్ని  వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు గుర్తించారు. జామతోటలకు  ప్రాణాంతకంగా  మారిన నెమటోడ్స్  నివారణకు  చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Read Also : Agriculture Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న యువకుడు

జామతోటలకు నులి పురుగుల వల్ల తీవ్ర నష్టం :
అన్నిరకాల ఉద్యాన పంటలకు  నులిపురుగులు  ప్రధాన సమస్య  మారాయి. భూమిలో ఉండే ఈ పురుగులు అనుకూల పరిస్థితుల్లో  మొక్కల వేర్లను ఆశించి రసాన్ని పీల్చేయటం  వల్ల పోషక పదార్థాలు అందక మొక్కలు నిలువునా ఎండిపోతాయి. వీటిని నెమటోడ్స్ అని కూడా అంటారు. వేర్లను అంటిపెట్టుకుని  వృద్ధి చెందటం వీటి లక్షణం.  చనిపోయిన మొక్కలను  పీకి చూసినప్పుడు  వేర్లపై  బుడిపెల రూపంలో కనిపిస్తాయి.

ఇటీవలి కాలంలో జామతోటల్లో  ఈ నులిపురుగుల  సమస్య తీవ్రంగా వుంది. ఖమ్మం జిల్లా వైరా పరిసర ప్రాంతాల్లోని  జామతోటల్లో  ఈ పురుగుల  తీవ్రతను  కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు గమనించారు . హైడెన్సిటీ  విధానంలో నాటిన ఈ తోటలో ఇప్పటికే  చాలా మొక్కలు చనిపోవటంతో  రైతు తీవ్రంగా నష్టపోయారు . ఈ నేపధ్యంలో  నెమటోడ్స్ నివారణకు చేపట్టాల్సిన  సమగ్ర చర్యల గురించి శాస్త్రవేత్త రైతులకు  వివరించారు.

Read Also : Sorghum Cultivation : జొన్న సాగుతో మంచి లాభాలు.. తక్కువ పెట్టుబడి.. తక్కువ రిస్క్..!