Rabi Crops : ప్రస్తుతం యాసంగి పంటల్లో చేపట్టే యాజమాన్యం

యాసంగిలో ఆలస్యంగా సాగుచేసిన వేరుశనగ పంట గింజ అభివృద్ధి చెందే దశలో ఉంది. ఈ దశలో నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి.

Rabi Crops : ప్రస్తుతం యాసంగి పంటల్లో చేపట్టే యాజమాన్యం

rabi crops cultivation and management techniques

Rabi Crops : పెసర, మినుము పంటలు పూత దశలో ఉన్నాయి. ఈ సమయంలో తేలికపాటి నీటి తడిని అందివ్వాలి. నీటి లభ్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కాయ, గింజ అభివృద్ధి దశలో నీటి తడి ఇచ్చినట్లయితే దిగుబడులు పెరుగుతాయి. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతల వలన పెసర, మినుము పంటల్లో రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగి పల్లాకు తెగులు ఆశించుటకు అనుకూలం. దీని నివారణకు ఎకరాకు 10 పసుపు రంగు జిగురు అట్టలను అమర్చుకోవాలి. ఉదృతి అధికంగా ఉంటే ఫిప్రోనిల్ 2 మి. లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

Read Also : Agriculture Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న యువకుడు

యాసంగిలో ఆలస్యంగా సాగుచేసిన వేరుశనగ పంట గింజ అభివృద్ధి చెందే దశలో ఉంది. ఈ దశలో నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులల్లో కాండంకుళ్లు తెగులు ఆశించుటకు అనుకూలం . దీని నివారణకు హెక్సాకొనజోల్ 2 మి. లీ. మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

ప్రస్తుతం ఉన్న పొడి వాతావరణ పరిస్థితుల కారణంగా మిరపలో తామర పురుగులు ఆశించే అవకాశం ఉంది. వీటి నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఫిప్రోనిల్ 2 మి. లీ. లేదా థయోమిథాక్సామ్ 0.3 గ్రా. లేదా డైఫెన్ థయోరాన్ 1 గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే వైరస్ తెగుళ్లు వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు. అక్కడక్కడ మిరపలో కాయకుళ్ళు, కొమ్మ ఎండు తెగులు గమనించడమైనది. వీటి నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లేదా మాంకోజెబ్ 2.5 గ్రా. లేదా ప్రోపికొనజోల్ 1 మి. లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ప్రస్తుత పొడి వాతావరణ పరిస్థితుల్లో బెండలో తెల్లదోమ ఆశించుటకు అనుకూలం. నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి. లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి . పిచికారి చేయకపోతే పల్లాకు తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. టమాటలో సూది పురుగు గమనించడమైనది. దీని నివారణకు నోవాల్యూరాన్ 1.5 మి. లీ. లేదా ఇమామెక్టిన్ మెంజోయేట్ 0.4 గ్రా. లేదా ఫ్లూబెండమైడ్ 0.25 మి. లీ. లేదా క్లోరాంట్రినిలిప్రోల్ 0.3 మి. లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తీగజాతి కూరగాయ పంటలలో రసంపీల్చే పురుగుల ఉధృతిని తగ్గించుకోవడానికి పసుపు, నీలం, తెలుపు రంగు జిగురు అట్టలను పొలంలో ఎకరాకు 20 నుండి 30 వరకు పెట్టుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు తీగజాతి కూరగాయ పంటలలో బంకతెగులు ఆశించుటకు అనుకూలం. దీని నివారణకు రిడోమిల్ 2.5 గ్రా. లేదా అజాక్సిస్ట్రోబిన్ 1 మి. లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

Read Also : Sesame Crop : యాసంగి నువ్వుల పంటలో చీడపీడల నివారణ