AP : బిగ్ న్యూస్…ఏకమైన నాయకులు…ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతల కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు నాయకులు ఏకమయ్యారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు.

AP : బిగ్ న్యూస్…ఏకమైన నాయకులు…ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతల కీలక నిర్ణయం

Ap Govt

Andhra Pradesh Govt Employees : ఏపీ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు నాయకులు ఏకమయ్యారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు విడివిడిగా ఆందోళనలు చేపట్టిన…వీరు కలిసికట్టుగా ఆందోళనలు చేసి హక్కులు సాధించుకోవాలని డిసైడ్ అయ్యారు. గత కొన్ని రోజులుగా పీఆర్సీ..తదితర అంశాలపై వీరు డిమాండ్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..2021, నవంబర్ 28వ తేదీ ఆదివారం ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంఘాల నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చి కీలక నిర్ణయం తీసుకున్నారు. అనంతరం జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఏపీ జేఏసీ అధ్యక్షులు : –

అక్టోబర్ నెలాఖరుకు పీఆర్సీ ఇస్తామని ప్రభుత్వం చెప్పిందనే విషయాన్ని ఏపీ జేఏసీ అధ్యక్షులు గుర్తు చేశారు. పీఆర్సీ నివేదిక అడిగినా..ఇంతవరకూ ఇవ్వలేదని, ఒకటో తేదీన జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల వివక్ష చూపిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా పలు తేదీల్లో తాము పలు కార్యక్రమాలు చేయడం జరుగుతోందన్నారు. డిసెంబర్ 01వ తేదీన సీఎస్ కు వినతిపత్రం..వచ్చే నెల 7 నుంచి 10 వరకూ నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు..10న మధ్యాహ్న భోజన సమయంలో నిరసనలు..13వ తేదీన అన్ని తాలూకా ముఖ్య కేంద్రాల్లో నిరసన..డిసెంబర్ 16వ తేదీన అన్ని తాలూకా ముఖ్య కేంద్రాల్లో ధర్నాలు..డిసెంబర్ 21న జిల్లా కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకూ ధర్నాలు..27వ తేదీన విశాఖలో, డిసెంబర్ 30వ తేదీనన తిరుపతిలో, జనవరి 3న ఏలూరులో ప్రాంతీయ సదస్సులు..జనవరి 6న ఒంగోలులో మహా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందన్నారు.

బొప్పరాజు వెంకటేశ్వర్లు (ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు) :-

ఉద్యమానికి వెళ్లాలని ఉద్యోగుల నుంచి ఒత్తిడి వస్తోందని, ఉద్యోగుల కోసం ఆత్మాభిమానం చంపుకుని అందరి దగ్గరకూ వెళ్లడం జరిగిందని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఉద్యోగులు దాచుకున్న రూ. 1600 కోట్లు ఎప్పుడిస్తారో చెప్పడం లేదని, ఉద్యోగ సంఘాలకు విలువ లేకుండా చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి అసెంబ్లీలో మాట్లాడిన తీరు ఉద్యోగులను బాధించిందని చెప్పారు. కరోనా సమయంలోనూ తాము ప్రభుత్వానికి పూర్తిగా సహకరించినట్లు..విధిలేని పరిస్థితుల్లో ఉద్యమబాట పడుతున్నట్లు ప్రకటించారు. PRC నివేదికను బయటపెట్టడానికి ఇబ్బంది ఏంటి అని ఆయన సూటిగా ప్రశ్నించారు. వీరి ప్రకటనపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.