AP Covid-19 Update : ఏపీలో కొత్తగా 117 కోవిడ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కొత్తగా 117 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. నిన్న కోవిడ్ నుంచి 241 మంది కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్ళ

AP Covid-19 Update : ఏపీలో కొత్తగా 117 కోవిడ్ కేసులు

Ap Covid Report

Updated On : November 15, 2021 / 6:01 PM IST

AP Covid-19 Update : ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కొత్తగా 117 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. నిన్న కోవిడ్ నుంచి 241 మంది కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్ళారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 2 వేల 961యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షల 70వేల 095 కి చేరింది. వీరిలో 20 లక్షల 52 వేల 718 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

Also Read : CM YS Jagan Review On Roads : రాష్ట్రంలో అన్నిరోడ్లు మరమ్మత్తులు చేయండి-సీఎం జగన్

ఏపీలో గత 24 గంటల్లో విశాఖ జిల్లాలో ఒక వ్యక్తి కోవిడ్ వల్ల మరణించాడు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14 వేల 416 కు చేరింది. నిన్నటివరకు రాష్ట్రంలో 3 కోట్ల 4 వేల 569 మంది శాంపిల్స్ పరీక్షించటం జరిగిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Ap Covid Up Date

Ap Covid Up Date