Andhra Pradesh : బాబు, బోండా ఉమా విచారణకు రావాలన్న మహిళా కమిషన్

అత్యాచార బాధితురాలిని పరామర్శించే క్రమంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను అగౌరవపరచడం.. బాధితురాలి ఆవేదన విననీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడం...

Andhra Pradesh : బాబు, బోండా ఉమా విచారణకు రావాలన్న మహిళా కమిషన్

Babu And Vasireddy

Updated On : April 22, 2022 / 7:00 PM IST

AP Women’s Commission : టీడీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీ రాష్ట్ర నేత బొండా ఉమకు రాష్ర్ట మహిళా కమిషన్ శుక్రవారం సమన్లు జారీ చేసింది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచార బాధితురాలిని పరామర్శించే క్రమంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను అగౌరవపరచడం.. బాధితురాలి ఆవేదన విననీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడం.. అత్యాచార బాధితురాలిని భయకంపితం చేసిన సంఘటనలపై విచారణకు చంద్రబాబు, బొండా ఉమ వ్యక్తిగతంగా హాజరు కావాలని మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. ఈనెల 27న ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి చంద్రబాబు, బొండా ఉమ స్వయంగా విచారణకు రావాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సమన్లలో ఆదేశించారు.

Read More : Minister Rajani : విజయవాడ యువతిపై అత్యాచారం ఘటనలో మరిన్ని చర్యలు : మంత్రి విడదల రజని

విజయవాడ ఆసుపత్రి దగ్గర శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. అత్యాచార బాధితురాలికి నేతల పరామర్శలతో హైటెన్షన్‌గా మారింది. టీడీపీ, వైసీపీ నేతలు ఎదురుపడటంతో వాగ్వాదం జరిగింది. ఇక మంత్రులు పరామర్శించారు. మంత్రులు తానేటి వనిత, జోగి రమేశ్, రజినీ పరామర్శించారు. బాధితురాలికి అండగా ఉంటామన్నారు. నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు హోం మంత్రి తానేటి వనిత. ఇక అంతకు ముందు ఆసుపత్రిలో చంద్రబాబు బాధితురాలిని పరామర్శించారు. పరామర్శించిన సమయంలో ఒకేసారి ఎదురుపడ్డారు చంద్రబాబు, మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ. ఆ సమయంలో టీడీపీ మహిళా నేతలు వాసిరెడ్డి పద్మను అడ్డుకోబోయారు.

Read More : AP CM Jagan : విజయవాడలో అత్యాచారం ఘటన.. బాధితురాలికి ప్రభుత్వం పరిహారం

బాధితురాలితో మాట్లాడుతున్నాను…రాజకీయం చేయవద్దని వాసిరెడ్డి పద్మ విజ్ఞప్తి చేశారు. దీంతో వాగ్వాదం జరిగింది. వెంటనే స్పందించిన చంద్రబాబు.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌తో అన్నారు. ఊరికే వచ్చి పరామర్శించి వెళ్లిపోతే కుదరదన్నారు. యువతికి అన్యాయం జరిగితే…పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. ఇక టీడీపీ నేత పంచుమర్తి అనురాధతో కాసేపు వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు కల్పించుకుని సర్దిచెప్పారు.