AP CM Jagan : విజయవాడలో అత్యాచారం ఘటన.. బాధితురాలికి ప్రభుత్వం పరిహారం

పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సీఐ, సెక్టార్ ఎస్ ఐ లపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాకుండా.. అత్యాచారం బాధితురాలికి పరిహారం ప్రకటించింది...

AP CM Jagan : విజయవాడలో అత్యాచారం ఘటన.. బాధితురాలికి ప్రభుత్వం పరిహారం

Jagan

Vijayawada Govt Hospital : విజయవాడలో ఓ మానసిక వికలాంగురాలైన యువతిపై ముగ్గురు కామాంధులు అత్యాచారం జరపడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏకంగా ఈ ఘటన ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకున్న ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. 30 గంటల పాటు మృగాళ్లు నరకం చూపించారు. తీవ్ర విమర్శలు చెలరేగడంతో ప్రభుత్వంలో కదలికి వచ్చింది. వెంటనే చర్యలు తీసుకొనేందుకు ఉపక్రమించింది. పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సీఐ, సెక్టార్ ఎస్ ఐ లపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాకుండా.. అత్యాచారం బాధితురాలికి పరిహారం ప్రకటించింది. రూ. 10 లక్షలు పరిహారం ప్రకటిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు.

Read More : Vijayawada : ఏపీలో మహిళలకు రక్షణ ఉందా ? ఆ ముగ్గురికి ఉరిశిక్ష వేయాలి

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. మరిన్ని చర్యలు తీసుకొంటోంది. నిందితులైన ఫాగింగ్ ఏజెన్సీ కార్మికులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆసుపత్రి సెక్యూర్టీ ఏజెన్సీ, ఫాగింగ్ ఏజెన్సీకి టెర్మినేషన్ నోటీసు జారీ చేసింది. ఆర్ఎంఓకి ఇప్పటికే షోకాజ్ నోటీసు జారీ చేసింది వైద్య ఆరోగ్య శాఖ. శాఖాపరంగా దర్యాప్తు చేయాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది.

Read More : AP Crime : విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వికలాంగురాలిపై సామూహిక అత్యాచార ఘటనలో సీఐ, ఎస్సై సస్పెన్షన్‌

మరోవైపు విజయవాడలో మానసిక వికలాంగురాలిపై జరిగిన ఘోరాన్ని టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఖండించారు. ప్రభుత్వాసుపత్రికి వచ్చి బాధితురాలిని.. ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. యువతికి ఉద్యోగం ఇవ్వాలని, రూ. కోటి పరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ పార్టీ తరపున రూ. 5 లక్షల పరిహారం అందిస్తామని, ప్రభుత్వ ఘోరమైన పాలన వైఫల్యంతోనే ఘటనలు జరుగుతున్నాయని, ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ ఘటనలో స్పెషల్ కోర్టు వేసి.. ముగ్గురు ముద్దాయిలకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఇతరులు భయపడే పరిస్థితి వస్తుందన్నారు చంద్రబాబు.