Vijayawada : ఏపీలో మహిళలకు రక్షణ ఉందా ? ఆ ముగ్గురికి ఉరిశిక్ష వేయాలి

బాధితురాలికి ఉద్యోగం ఇవ్వాలని.. రూ. కోటి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ పార్టీ తరపున బాధితురాలికి రూ. 5 లక్షల సహాయం చేస్తున్నట్లు.. నిందితులకు శిక్ష పడే వరకు...

Vijayawada : ఏపీలో మహిళలకు రక్షణ ఉందా ? ఆ ముగ్గురికి ఉరిశిక్ష వేయాలి

Babu

Chandrababu Visit Vijayawada Govt Hospital : ఏపీ రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉందా ? రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా కొనసాగుతోంది ? ఆడబిడ్డల యొక్క మనోవేదన ప్రభుత్వానికి తెలియడం లేదా ? ఇంకెన్ని మానభంగాలు జరగాలని ప్రశ్నించారు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు. విజయవాడలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం జరగడం రాష్ట్రానికే అవమానమని, దీనిని ఎలా అభివర్ణించాలో చెప్పడం అర్థం కావడం లేదని తెలిపారు. ఘటనను తీవ్రంగా గర్హించడమే కాకుండా.. ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలైన ఓ యువతిపై ముగ్గురు యువకులు అత్యంత పాశవికంగా 30 గంటల పాటు అత్యాచారానికి ఒడిగట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. విషయం తెలుసుకున్న చంద్రబాబు నేరుగా విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి బాధితురాలిని పరమార్శించారు. కుటుంబానికి ధైర్యం చెప్పారు.

Read More : AP Crime : విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వికలాంగురాలిపై సామూహిక అత్యాచార ఘటనలో సీఐ, ఎస్సై సస్పెన్షన్‌

అనంతరం బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీనికి సీఎం జగన్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎవరితోనే మాట్లాడిస్తే.. తాము భయపడిపోమన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ.. రాష్ట్రాన్ని తగులబెడుతున్నారని.. ఒక్క మాటలో చెప్పాలంటే మారణహోమం సృష్టిస్తున్నారని వెల్లడించారు. ఈ ఘటనలో స్పెషల్ కోర్టు వేయాలని.. ముగ్గురు ముద్దాయిలకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఇతరులు భయపడే పరిస్థితి వస్తుందన్నారు. అంతేగాకుండా బాధితురాలికి ఉద్యోగం ఇవ్వాలని.. రూ. కోటి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ పార్టీ తరపున బాధితురాలికి రూ. 5 లక్షల సహాయం చేస్తున్నట్లు.. నిందితులకు శిక్ష పడే వరకు అమ్మాయికి అండగా పార్టీ ఉంటుందన్నారు. ప్రభుత్వాసుపత్రిలో ఒక ఆడబిడ్డను మోసగించి తీసుకొచ్చి.. 30 గంటల పాటు ముగ్గురు వ్యక్తులు మానవభంగం చేశారంటే.. ఏ విధంగా ఊహించాలో అర్థం కావడం లేదన్నారు. తొలుత శ్రీకాంత్ అనే వ్యక్తి తీసుకరావడం.. తర్వాత బాబురావు, పవన్ కళ్యాణ్ లు సామూహికంగా మానవభంగం చేశారని తెలిపారు.

Read More : Crime news: వరంగల్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై దాడి..

ప్రభుత్వానికి సిగ్గు ఉందా ? అని సూటిగా ప్రశ్నించారు. సున్నా వడ్డీ పథకం కోసం సీఎం జగన్ ప్రకాశం జిల్లాకు వెళ్లారని.. ప్రభుత్వాసుపత్రికి రావాల్సింది పోయి.. అక్కడకు వెళ్లడం ఏంటనీ నిలదీశారు. అమ్మాయిని ఓదార్చి ఉంటే బాగుండేదన్నారు. ఘటన జరిగిన అనంతరం తండ్రి పీఎస్ కు వెళ్లి.. ఫిర్యాదు చేస్తే పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం కరెక్టు కాదన్నారు. ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదని.. రాష్ట్రాన్ని తగులబెడుతారా ? అని ప్రశ్నించారు. పాలకులు చేసే పనుల వల్ల సంఘ విద్రోహశక్తులు చెలరేగిపోతున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నో ఘటనలు జరుగుతున్నాయని, ప్రజలందరూ తిరగబడితే ప్రభుత్వం పారిపోతుందని.. బాధితురాలికి అందరూ అండగా నిలవాలని బాబు పిలుపునిచ్చారు.