Minister Rajani : విజయవాడ యువతిపై అత్యాచారం ఘటనలో మరిన్ని చర్యలు : మంత్రి విడదల రజని

విజయవాడ జిజిహెచ్ లో సెక్యూరిటీ ఏజెన్సీకి, ఫాగింగ్‌ ఏజెన్సీకి టెర్మినేషన్‌ నోటీసు జారీ చేశామని తెలిపారు. సీఎస్‌ ఆర్‌ఎంఓకి ఇప్పటికే అధికారులు షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లు చెప్పారు.

Minister Rajani : విజయవాడ యువతిపై అత్యాచారం ఘటనలో మరిన్ని చర్యలు : మంత్రి విడదల రజని

Rajani (1)

Minister Vidadala Rajani : విజయవాడ జిజిహెచ్ లో జరిగిన యువతిపై అత్యాచార ఘటనపై మరిన్ని చర్యలు తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజని తెలిపారు. శాఖా పరంగా పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని డిఎంఈకి ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ఆస్పత్రి సిబ్బందిపైనా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులు ఫాగింగ్‌ ఏజెన్సీకి చెందిన కార్మికులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వారిని వెంటనే విధుల నుంచి తొలగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు చేసినట్లు వెల్లడించారు.

విజయవాడ జిజిహెచ్ లో సెక్యూరిటీ ఏజెన్సీకి, ఫాగింగ్‌ ఏజెన్సీకి టెర్మినేషన్‌ నోటీసు జారీ చేశామని తెలిపారు. సీఎస్‌ ఆర్‌ఎంఓకి ఇప్పటికే అధికారులు షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లు చెప్పారు. శాఖా పరంగా దర్యాప్తు చేయాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కు ఆదేశాలు చేసినట్లు పేర్కొన్నారు. నివేదిక అందిన వెంటనే మరిన్ని చర్యలు తప్పవని హెచ్చరించారు. యువతిపై అత్యాచారం ఘటరనలో ఇప్పటికే సీఐ, ఎస్ ఐ సస్పెన్షన్ లో ఉన్నారు.

AP CM Jagan : విజయవాడలో అత్యాచారం ఘటన.. బాధితురాలికి ప్రభుత్వం పరిహారం

విజయవాడలో ఓ మానసిక వికలాంగురాలైన యువతిపై ముగ్గురు కామాంధులు అత్యాచారం జరపడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏకంగా ఈ ఘటన ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకున్న ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. 30 గంటల పాటు మృగాళ్లు నరకం చూపించారు. తీవ్ర విమర్శలు చెలరేగడంతో ప్రభుత్వంలో కదలికి వచ్చింది.

వెంటనే చర్యలు తీసుకొనేందుకు ఉపక్రమించింది. పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సీఐ, సెక్టార్ ఎస్ ఐ లపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాకుండా.. అత్యాచారం బాధితురాలికి పరిహారం ప్రకటించింది. రూ. 10 లక్షలు పరిహారం ప్రకటిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు.