Andhraradesh : 40 కిలోల కారంతో అభిషేకం చేయించుకున్న స్వామీజీ

కార్తీక మాసం పర్వదినం సందర్భంగా ఓ స్వామీజీ భక్తులతో 40కిలోల కారంతో అభిషేకం చేయించుకున్నారు. రాత్రి అంతా జాగారం చేసిన భక్తులు స్వామీజీని కాంతో అభిషేకరం చేశారు.

Andhraradesh : 40 కిలోల కారంతో అభిషేకం చేయించుకున్న స్వామీజీ

Abhishekam to Swamiji with 40 kg of chilli powder

Andhraradesh : ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలో ఓ వింత అభిషేకం ఆసక్తి కలిగిస్తోంది. సాధారణంగా స్వామీజీలంటే ఏవో జిమ్మిక్కులు చేసిన శివలింగాలను సృష్టించటం వంటివి చేస్తుంటారు. తమ ఆశ్రమంలో భక్తులకు భజనలపేరుతో పూనకాలు తెప్పిస్తుంటారు. కానీ ఏపీలోని ఏలూరు జిల్లాలో ఓ స్వామీజీ మాత్రం ఏఖంగాకారంతో అభిషేకం చేయించుకున్నాడు.

ద్వారకాతిరుమల మండలంలో దొరసానిపాడులోని శ్రీశివ దత్తాత్రేయ ప్రత్యంగిరా వృద్ధాశ్రమంలో దేవీ ఆవాహనలో ఉన్న శివస్వామిని భక్తులు 40 కిలోల కారంతో శివస్వామికి అభిషేకం జరిగింది. ప్రత్యంగిరా అమ్మవారికి కారం అంటే ఎంతో ప్రీతిపాత్రమని అందుకే అమ్మవారిని ఆవాహన చేసుకున్న శివస్వామికి కారంతో అభిషేకాలు జరపడం సంప్రదాయమని నిర్వాహకులు తెలిపారు. ఆదివారం రాత్రి అంతా ఆశ్రమంలోనే జాగారం చేసిన భక్తులు తెల్లవారి కార్తీక సోమవారం నాడు స్వామిజీకి కారంతో అభిషేకాలు చేసారు.