No CPS Only OPS : సీపీఎస్ రద్దు చేసి.. ఓపీఎస్ అమలు చేయాల్సిందే-ఉద్యోగ సంఘాలు

సీపీఎస్ రద్దు.. ఓపీఎస్ పునరుద్దరణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు.

No CPS Only OPS : సీపీఎస్ రద్దు చేసి.. ఓపీఎస్ అమలు చేయాల్సిందే-ఉద్యోగ సంఘాలు

No Cps Only Ops

No CPS Only OPS : సీపీఎస్ రద్దు.. ఓపీఎస్ పునరుద్దరణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు. పీఆర్సీ చర్చల్లో ప్రభుత్వం ఏం చేసిందో ఇప్పుడు కూడా అలానే చేసేందుకు యత్నిస్తోందని ఆరోపించారు ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు. జీపీఎస్ ను తెస్తే వ్యతిరేకిస్తామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తేల్చి చెప్పారు.

కాగా, పెన్షన్ స్కీమ్ పై ఉద్యోగ సంఘాలు, ఏపీ ప్రభుత్వం మధ్య చర్చల్లో ప్రతిష్ఠంభన నెలకొంది. జీపీఎస్ కే కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే, జీపీఎస్ కు ఒప్పుకునేది లేదని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. అంతేకాదు జీపీఎస్ అంటే మరోసారి చర్చలకు వచ్చేది లేదని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పాయి. ఓపీఎస్ తప్ప రెండో చర్చల ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాలు అంటుండగా.. ఓపీఎస్ తో ప్రభుత్వంపై మోయలేని భారం పడుతుందని మంత్రుల కమిటీ చెబుతోంది. సీపీఎస్ కంటే 65శాతం ఎక్కువ పెన్షన్ వచ్చేలా జీపీఎస్ లో అవకాశం ఉందని మంత్రుల కమిటీ చెప్పింది. ఉద్యోగులను జీపీఎస్ కు ఒప్పించే ప్రయత్నం చేస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

జీపీఎస్ సంప్రదింపుల సమావేశం తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు తమ స్పందన తెలియజేశారు. జీపీఎస్ వద్దు ఓపీఎస్ మాత్రమే కావాలని మంత్రుల కమిటీతో చెప్పామని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె ఆర్ సూర్యనారాయణ తెలిపారు. గత సమావేశానికి కొనసాగింపుగా నేటి సమావేశం జరిగిందన్నారు. జీపీఎస్ ప్రతిపాదనలు సహేతుకంగా లేవని మంత్రుల కమిటీతో చెప్పామన్నారు. సీపీఎస్ రద్దు అని చెబితేనే ఇకపై సమావేశానికి రావాలని నిర్ణయించామన్నారు.(No CPS Only OPS)

బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు
మాకు పాత పెన్షన్ విధానం మాత్రమే కావాలని చెప్పాము. జీపీఎస్ పేరుతో సమావేశాలు పెడితే ఇక వచ్చేది లేదని చెప్పాము. సీపీఎస్ రద్దు అయి ఓపీఎస్ వచ్చే వరకు మా పోరాటం ఆ ఉద్యోగుల తరపున కొననసాగిస్తాం.

AP Govt: ఉద్యోగ సంఘాలతో ముగిసిన మంత్రుల కమిటీ చర్చలు

బొప్పరాజు, ఏపీ జేఏసీ అమరావతి
2003లో నియామకంపొందిన వారికి ఓపీఎస్ లోకి తీసుకోవాలి. గత ప్రభుత్వంలో టక్కర్ కమిటీ రిపోర్టును అన్ని ఉద్యోగ సంఘాలు తోసిపుచ్చాయి. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఓపీఎస్ లు అమల్లోకి వచ్చాయి. ఇకపై ఓపీఎస్ పై చర్చిస్తేనే మీటింగ్ కు వస్తాము. ఆర్టీసీ ఉద్యోగులకు ఈరోజుకు పాత జీతాలు పడుతున్నాయి. పే రోల్ లో ఐఆర్ కాలంను తిరిగి ఉంచాలని కోరాము.

నాపా ప్రసాద్, ఏపీ సచివాలయ ఉద్యోగులు సంఘం
ఏదైనా ఒక రాష్ట్రం సీపీఎస్ రద్దుకు రాజస్తాన్ ముందుకు వచ్చారు. సీపీఎస్ కంట్రిబ్యూషన్ ను కూడా ఆపేశారు. సీపీఎల్ లో ఉన్న అవలక్షణాలు అన్నీ జీపీఎస్ లోనూ ఉన్నాయి. ఆర్టికల్ 309 ప్రకారం సీపీఎస్ నుండి రాజస్తాన్ బయటకు వచ్చింది. ఓపీఎస్ ప్రతిపాదనలపై నెక్స్ట్ మీటింగ్ జరగాలి. లేని పక్షంలో మేము హాజరయ్యేది లేదు.

రాజేష్, సచివాలయ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ ఓల్డ్ పెన్షన్ ఎలా ఇవ్వచ్చో ప్రభుత్వానికి పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా చెప్పాము. జీపీఎస్ విషయం పేపర్ ప్రకటన ఇవ్వడం మమ్మల్ని చాలా బాధించింది. ఆ యాడ్ లకు ఖర్చు పెట్టిన సొమ్ముతో మా డీఏ అరియర్స్ ఇవ్వొచ్చు.

జీపీఎస్ పై నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో ఏపీ ఉద్యోగ సంఘాలతో ఏపీ మంత్రుల కమిటీ సమావేశం నిర్వహించింది. పాత పెన్షన్ విధానం (సీపీఎస్) సాధ్యం కాదని మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలకు తేల్చి చెప్పింది. జీపీఎస్ పైనే చర్చిద్దామని కమిటీ స్పష్టం చేసింది. పాత పెన్షన్ విధానంతో న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడింది. జీపీఎస్ విధానం అమలుకు ఉద్యోగ సంఘాలు సహకరించాలని, దీనిపై ఉద్యోగులకు నచ్చచెప్పాలని సూచించింది. అయితే ఉద్యోగులు మాత్రం పాత పెన్షన్ విధానంపైనే చర్చించాలని డిమాండ్ చేశారు.

జీపీఎస్ లో సవరణలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఉద్యోగులకు మేలు చేసేందుకు జీపీఎస్ తీసుకొచ్చామన్నారు. సీపీఎస్ కంటే జీపీఎస్ మెరుగైనదని వెల్లడించారు. పాత విధానంతో ఆర్థికంగా ఎంతో భారం పడుతుందని సజ్జల వివరించారు. ఐదేళ్ల కోసం కాదు… భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నాం అని స్పష్టం చేశారు. సీపీఎస్ లో పెన్షన్ కు భరోసా ఉండదని, జీపీఎస్ లో 33 శాతం గ్యారంటీతో ప్రతిపాదన చేశామని సజ్జల పేర్కొన్నారు.