AP Govt: ఉద్యోగ సంఘాలతో ముగిసిన మంత్రుల కమిటీ చర్చలు AP Govt discussions with employees

AP Govt: ఉద్యోగ సంఘాలతో ముగిసిన మంత్రుల కమిటీ చర్చలు

సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ మంగళవారం జరిపిన చర్చలు ముగిశాయి. సీపీఎస్‌ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

AP Govt: ఉద్యోగ సంఘాలతో ముగిసిన మంత్రుల కమిటీ చర్చలు

AP Govt: సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ మంగళవారం జరిపిన చర్చలు ముగిశాయి. సీపీఎస్‌ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలతో సమావేశమైంది.

Qutub Minar Row: కుతుబ్ మినార్‌ను దేవాలయంగా మార్చలేం: పురాతత్వ శాఖ

సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అయితే, ఓపీఎస్‌కు ఒప్పుకొనేది లేదని ప్రభుత్వం చెబుతోంది. సీపీఎస్ కంటే 65 శాతం ఎక్కువ పెన్షన్ వచ్చేలా, జీపీఎస్ ప్రవేశపెడతామని సజ్జల అన్నారు. ‘ఓపీఎస్ ద్వారా ప్రభుత్వంపై మోయలేని భారం పడుతుంది. ఉద్యోగుల పెన్షన్‌కు మినిమమ్ గ్యారెంటీ కోసమే జీపీఎస్ తీసుకొచ్చాం. పాత విధానంతో 440 శాతం భారం పడుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరిగితే ఫర్వాలేదు. కానీ, ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. ఉద్యోగులు అర్థం చేసుకోవాలి. రాజస్థాన్‌లో సీపీఎస్ రద్దు రాజకీయంగా తీసుకున్న నిర్ణయం. పాత పెన్షన్ విధానం వల్ల 2030 తర్వాత పెనుభారం పడుతుంది.

COVID Cases In India: దేశంలో తగ్గిన కరోనా కేసులు

అందుకే జీపీఎస్ అమలు చేసేందుకు నిర్ణయించాం. దీనికి ఉద్యోగులను ఒప్పించే ప్రయత్నం చేస్తాం. ఒప్పుకుంటారనే నమ్మకం ఉంది. ఓపీఎస్‌కు అవకాశమే లేదు. జీపీఎస్ ఒక్కటే మార్గం. లేకుంటే ఇంతవరకు చర్చలు ఎందుకు?’’ అని సజ్జల వ్యాఖ్యానించారు. మరోవైపు జీపీఎస్‌కు ఒప్పుకొనేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. జీపీఎస్ అంటే మరోసారి చర్చలకు కూడా రాబోమని తేల్చిచెప్పారు.

×