AP PRC : పీఆర్సీ రిపోర్టు ఇస్తారా ? ఇవ్వరా ? భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం

ఏపీలో పీఆర్సీ రగడ ముదురుతోంది. విజయవాడ ఎన్జీవో హోంలో ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ నేతలు అత్యవసర సమావేశమయ్యారు. 9 ఉద్యోగ సంఘాల నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు.

AP PRC : పీఆర్సీ రిపోర్టు ఇస్తారా ? ఇవ్వరా ? భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం

Ap Govt

AP Govt Employees : ఏపీలో పీఆర్సీ రగడ ముదురుతోంది. విజయవాడ ఎన్జీవో హోంలో ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ నేతలు అత్యవసర సమావేశమయ్యారు. 9 ఉద్యోగ సంఘాల నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. జాయింట్ స్టాఫ్‌ కౌన్సిల్ సమావేశం తీరు.. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. పీఆర్‌సీపై ఇరు జేఏసీలతో కూడిన కమిటీ వేసి కార్యాచరణ రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. మరో రెండు రోజుల్లో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అంతకుముందు జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్ సమావేశాన్ని తొమ్మిది ఉద్యోగ సంఘాలు బాయ్‌కాట్ చేశాయి.

Read More : Heavy Rains: నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

13 సంఘాల్లో 9 ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ తీరును తప్పుబట్టగా… గత నెలాఖరున పీఆర్సీ ప్రకటిస్తామని మాట తప్పిందని ఆరోపించాయి. పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. అధికారుల కమిటీ పీఆర్సీపై మళ్లీ అధ్యయనం చేయడం ఏంటనీ ప్రశ్నించారు బండి శ్రీనివాసరావు. పీఆర్సీ నివేదికను ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారని మరో ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు నిలదీశారు. ఉద్యోగులను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read More : Petrol In India : చమురు ధరలు నో ఛేంజ్, ఏ నగరంలో ఎంత ?

అటు జాయింట్ స్టాఫ్‌ కౌన్సిల్ కేవలం పీఆర్సీ కోసమే కాదని.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చర్చించినట్లు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి తెలిపారు. సమావేశంలో ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇస్తామని ప్రభుత్వం నుంచి హామీ లభించిందన్నారు వెంకట్రామిరెడ్డి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెడికల్ రీయింబర్స్ మెంట్‌ను కొనసాగించాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారని వెంకట్రామిరెడ్డి చెప్పారు.