వికేంద్రీకరణ బిల్లుపై మళ్లీ మండలిలో వాడీవేడీ చర్చలు… మంత్రులను మోహరించిన వైసీపీ, మొండిపట్టుపట్టిన టీడీపీ

  • Published By: Subhan ,Published On : June 17, 2020 / 11:58 AM IST
వికేంద్రీకరణ బిల్లుపై మళ్లీ మండలిలో వాడీవేడీ చర్చలు…  మంత్రులను మోహరించిన వైసీపీ, మొండిపట్టుపట్టిన టీడీపీ

ఏపీ శాసనమండలిలో సీఆర్డీఏ, పరిపాలనా వికేంద్రీకరణలపై చర్చ వాడీవేడిగా జరుగుతుంది. ఈ మేరకు బిల్లులను అడ్డుకునేందుకు టీడీపీకి చెందిన 28ఎమ్మెల్సీలు మండలికి చేరుకున్నారు. అధికార పార్టీకి చెందిన మంత్రులంతా మండలికి చేరుకుని మద్ధతు ఇచ్చేందుకు సిద్ధమైయ్యారు. తెలుగుదేశం పార్టీ సభ్యులంతా హాజరైనప్పటికీ శత్రుచర్ల విజయరామారావు మండలికి రాలేదు. 

చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న కేఈ ప్రభాకర్ తోనూ చంద్రబాబు చర్చించి తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ చర్చలు ఫలించినట్లుగానే కనిపిస్తుంది. రూల్ 90కింద ఓటింగ్ చేపట్టాలని పట్టుబట్టింది. గతంలో ఓ సారి బిల్లు సెలక్ట్ కమిటీకి పంపిన బిల్లు ఇక్కడికి ఎలా వస్తుందని టీడీపీ ప్రశ్నిస్తుంది. రెండోసారి వచ్చినట్లుగా భావించాలని అధికార పార్టీ చెబుతుంది. 

సభ మొదలైనప్పటి నుంచి వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్సీలు లేవనెత్తారు. ముద్రగడ ఉద్యమం చేస్తే.. 3వేల మందితో అరెస్ట్ చేయలేదా అంటూ మరో మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. మంత్రులకు టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కౌంటరిచ్చారు. మంత్రుల గడ్డాలపై దీపక్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అనిల్ కౌంటర్ ఇచ్చారు. 

గడ్డం పెంచుకున్నవాళ్లంతా రౌడీలా.. గడ్డం ఉంటే రౌడీలా అంటూ మండలి ఛైర్మన్ షరీఫ్‌ను అనిల్ అడిగారు. చంద్రబాబుకు గడ్డం ఉంది ఆయన రౌడీనా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో వాగ్వాదం జరగడంతో సభను మండలి ఛైర్మన్ షరీఫ్ వాయిదా వేశారు.

Read: పెన్నానది ఇసుకమేటల్లోంచి బైటపడ్డ 200ఏళ్లనాటి శివాలయం..