CM Jagan : మంగళగిరి, నగరి, కడప నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం.. పూర్తి షెడ్యూల్ ఇలా..

జగన్ సభలకు భారీగా ప్రజలు తరలివస్తున్న నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో నిర్వహించనున్న సభల వద్ద ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా వైసీపీ నేతలు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

CM Jagan : మంగళగిరి, నగరి, కడప నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం.. పూర్తి షెడ్యూల్ ఇలా..

CM Jagan

CM Jagan Election Campaign 2024 : ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడుతోంది. మరో నాలుగు రోజుల్లో పోలింగ్ జరగనుండగా.. వచ్చే ఆదివారంతో ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడనుంది. దీంతో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. శుక్రవారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. గుంటూరు, చిత్తూరు, కడప లోక్ సభ నియోజకవర్గాల్లో జగన్ ప్రచారం కొనగసాగనుంది.

Also Read : Kcr : పాకిస్థాన్, పుల్వామా పేరు చెప్పి పదేళ్లు పూర్తి చేసుకున్నారు- బీజేపీపై కేసీఆర్ నిప్పులు

శుక్రవారం ఉదయం 10గంటలకు గుంటూరు లోక్ సభ స్థానం పరిధి మంగళగిరిలోని పాత బస్టాండ్ సెంటర్ లో జరిగే సభలో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని నగరి నియోజకవర్గం పుత్తూరులో ఉన్న కార్వేటినగరం రోడ్డు కాపు వీధి సర్కిల్ లో జరిగే సభలో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం కడపలోని శ్రీ పొట్టి శ్రీరాములు సర్కిల్ లో జరిగే సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

Also Read : Cm Jagan : చంద్రబాబును నమ్మడం అంటే మళ్లీ మోసపోవడమే- రాజంపేటలో సీఎం జగన్

జగన్ సభలకు భారీగా ప్రజలు తరలివస్తున్న నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో నిర్వహించనున్న సభల వద్ద ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా వైసీపీ నేతలు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ప్రచార సభలో పాల్గోనున్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నియోజకవర్గం ప్రజలకు జగన్ ఎలాంటి హామీలు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.