Minister Vellampalli : హిందువులపై బీజేపీది కపట ప్రేమ : మంత్రి వెల్లంపల్లి

టీడీపీ, బీజేపీ కూల్చిన ఆలయాలను నిర్మించిన ఘనత సీఎం జగన్‌ది అన్నారు. చంద్రబాబు హయాంలో ఆలయాలను కూల్చినప్పుడు బీజేపీ నేతలు ఎక్కడున్నారని ప్రశ్నించారు.

Minister Vellampalli : హిందువులపై బీజేపీది కపట ప్రేమ : మంత్రి వెల్లంపల్లి

Vellampalli 11zon

Updated On : January 22, 2022 / 7:47 PM IST

Vellampalli criticized the BJP and TDP : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వార్నింగ్ ఇచ్చారు. సోము వీర్రాజు దేశం భక్తుడా? తెలుగుదేశం భక్తుడా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి గురించి బీజేపీ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. చంద్రబాబుతో కలిసి ఆలయాలను కూల్చిన చరిత్ర బీజేపీదని విమర్శించారు.

టీడీపీ, బీజేపీ కూల్చిన ఆలయాలను నిర్మించిన ఘనత సీఎం జగన్‌దన్నారు. చంద్రబాబు హయాంలో ఆలయాలను కూల్చివేసినప్పుడు బీజేపీ నేతలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. హిందువులపై బీజేపీది కపట ప్రేమ అని విమర్శించారు.

Minister Kodali Nani : గుడివాడలో కాసినో జరిగినట్లు నిరూపిస్తే చావడానికైనా రెడీ : మంత్రి కొడాలి నాని

రాష్ట్రంలో శాంతి భద్రతలకు బీజేపీ విఘాతం కలిగిస్తోందని విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై సోము వీర్రాజు ఒక్కసారైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. రూ.50లకు చీప్‌ లిక్కర్ ఇస్తానన్న వ్యక్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడా? ఎద్దేవా చేశారు.