Minister Kodali Nani : గుడివాడలో కాసినో జరిగినట్లు నిరూపిస్తే చావడానికైనా రెడీ : మంత్రి కొడాలి నాని
గుడివాడలో తన కళ్యాణ మండపంలో ఎలాంటి క్యాసినో ఆడలేదని స్పష్టం చేశారు. తాను హైదరాబాద్ లో ఉండగా పక్కా ప్లాన్ ప్రకారం ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Kodali Nani angry with Chandrababu : గుడివాడలో తన కళ్యాణ మండపంలో ఎలాంటి కాసినో జరగలేదని ఏపీ మంత్రి కొడాలి స్పష్టం చేశారు. గుడివాడలో కాసినో జరిగినట్లు నిరూపిస్తే చావడానికైనా సిద్ధమని మంత్రి తేల్చి చెప్పారు. తన సవాల్ చంద్రబాబుకేనని చెప్పారు. తాను హైదరాబాద్ లో ఉండగా పక్కా ప్లాన్ ప్రకారం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు బ్లాక్ బెయిల్ రాజకీయాలకు పెట్టింది పేరు అని ఎద్దేవా చేశారు. తప్పుడు ఆరోపణలను తాను కేర్ చేయనని చెప్పారు. తన సవాల్ కు ఇప్పటికి కట్టుబడి ఉన్నా, గుడివాడలో ఏం జరుగలేదన్నారు.
ఈ మేరకు శనివారం మంత్రి కొడాలి నాని టెన్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. చంద్రబాబు కోసం 10 రోజులైనా ఎదురు చూస్తానని చెప్పారు. తన కళ్యాణ మండపంలో ఏం జరిగిందో నిరూపించాలని డిమాండ్ చేశారు. తనకు పాస్ పోర్టు రాలేదు, ఏ దేశం వెళ్లలేదన్నారు. తనకు నారా లోకేష్ మాదిరిగా విదేశీ సంస్కృతి లేదన్నారు. తనకు కాసినో అంటే ఏంటో తెలియదన్నారు. టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ ఏం తేలుస్తుందని ప్రశ్నించారు. సీఎం జగన్ తనను ఎలాంటి వివరణ కోరలేదన్నారు.
AP Corona : ఏపీలో ఒక్కరోజే 12,926 కరోనా కేసులు, ఆరు మరణాలు నమోదు
గుడివాడలో తన కళ్యాణ మండపంలో ఎలాంటి క్యాసినో ఆడలేదని స్పష్టం చేశారు. తాను హైదరాబాద్ లో ఉండగా పక్కా ప్లాన్ ప్రకారం ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు.. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పెట్టింది పేరని విమర్శించారు. తనపై ఆరోపణలు చేస్తే భయపడుతాం అనుకుంటుంన్నాడు…ఏం చేయలేడు అని పేర్కొన్నారు. చంద్రబాబు తనకు అనుకూల మీడియాతో దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. తనను టార్గెట్ చేసి జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి చంద్రబాబు పన్నిన కుట్ర అని అన్నారు.
ఆధారాలు ఉన్నాకా ..నిజనిర్ధారణ కమిటీ ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉంటే బ్రోకర్ పనులు చేసుకోవచ్చనే..ఇలాంటి ఆరోపణలు టీడీపీ నేతలు, కొన్ని మీడియా సంస్థలు చేస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు నిరూపిస్తే..నేను పెట్రోల్ పొసుకొని చనిపోతా అని సవాల్ చేశానని గుర్తు చేశారు. సవాల్ కు కట్టుబడి ఉన్నా.. గుడివాడ లో ఏం జరగలేదు కాబట్టి.. ఆ పెట్రోల్ చంద్రబాబు మీద పోసుకుంటే ఏపీకి పట్టిన పీడ విరగడవుతుందన్నారు. బొండా వంటి పకోడీ బ్యాచ్ సస్తే ఏంటి.. బతికేతే ఏంటి..ఎవడికి ఉపయోగం అన్నారు. చంద్రబాబు కోసం పది రోజులైనా వేయిట్ చేస్తా.. తన కళ్యాణ మండపంలో ఏం జరిగిందో నిరూపించాలన్నారు.
చంద్రబాబు రాజకీయ వ్యభిచారి.. ఆడవాళ్లను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తాడని విమర్శించారు. దళితులను, బీసీలను పంపించి కుల రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తాను కూడా చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని చెబుతా.. ఒక కమిటీ వేసి వెళ్లమంటే.. ఆయన ఇంటికి రానిస్తారా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ మీద ప్రేమ ఉన్నట్లు ఆయన పుట్టిన గుడివాడ మీద దొంగ ప్రేమ చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ను ఎన్ని మాటలు అన్నారో.. చెప్పులేసి ఎంతగా అవమానించారో అందరికీ తెలుసు అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవ్గానికి ఓ క్లబ్ నడిపిన చరిత్ర చంద్రబాబుది అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఎన్ని క్లబ్ లు ఉండేవి..తెలంగాణ కేసీఆర్, ఏపీలో జగన్ వచ్చాక క్లబ్బులన్ని మూతపడ్డాయన్నారు. చంద్రబాబు 420, ఓ గజ దొంగ అని ఘాటుగా విమర్శించారు. తనకు క్యాసినో అంటే ఏంటో తెలియదు.. తనకు పాస్ పోర్ట్ లేదు… ఏ దేశం వెళ్లలేదని చెప్పారు. గోవా మాత్రం 15 ఏళ్ల క్రితం ఒక్కసారి మాత్రమే ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చినట్లు గుర్తు చేశారు. తనకు లోకేష్ మాదిరిగా విదేశీ సంస్కృతి లేదు..లోకేష్ నేచర్ ఏంటో .. గూగుల్ లో ఆయన ఫోటోలు చూస్తేనే తెలుస్తోందని ఎద్దేవా చేశారు. తనను అడ్డం పెట్టుకుని జగన్ మోహన్ రెడ్డిని బద్నాం చేయాలనే చంద్రబాబు కోరిక ఎప్పటికీ నెరవేరదన్నారు.
- TDP mahanadu: నేటి నుండి టీడీపీ మహానాడు.. పసుపు మయంగా మారిన ఒంగోలు..
- చంద్రబాబు, పవన్ వల్లే అలజడులు..!
- Kottu Satyanarayana Allegations : కోనసీమ అల్లర్లు.. జనసేన, టీడీపీ కుట్రలో భాగమే -మంత్రి సంచలన ఆరోపణలు
- వైసీపీది ఐరన్ లెగ్ పాలన!
- AP Politics : ‘YCP ట్రాప్ లో పడొద్దు..టీడీపీతో పొత్తే బెటర్’అంటూ జనసేనానికి హరిరామజోగయ్య లెటర్
1TG Venkatesh Land Grab : బంజారాహిల్స్ భూకబ్జా కేసు.. బీజేపీ ఎంపీకి బిగ్ రిలీఫ్
2Son MurderAttempt On Father : దారుణం.. ఆస్తి కోసం కన్నతండ్రినే చంపాలని చూసిన కొడుకు, సీసీ కెమెరాలో షాకింగ్ విజువల్స్
3Loan App Harassment : న్యూడ్ ఫొటోలతో మహిళకు వేధింపులు.. లోన్ యాప్‌లతో జాగ్రత్త
4Telangana Covid Report Latest : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
5NBK108: బాలయ్య కోసం సీనియర్ హీరోయిన్..?
6Don: 100 కోట్ల డాన్.. ఓటీటీలో వచ్చేది అప్పుడే!
7Boy smokes Packet cigarettes: ‘రాకీ భాయ్’లా మారాలని ప్యాకెట్ సిగరెట్స్ కాల్చిన బాలుడు: ఆసుపత్రిపాలు
8Varun Gandhi: దేశంలో 60 లక్షల ఉద్యోగాలు ఖాళీ: వరుణ్ గాంధీ
9Salaar: పూర్తి యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిన సలార్
10Fake Currency: దడ పుట్టిస్తున్న నకిలీ నోట్ల చలామణి: రూ.500 నోట్లలో 100 శాతం పెరిగాయన్న ఆర్బీఐ
-
Ram Pothineni: ఎట్టకేలకు ముగించేసిన వారియర్!
-
Neck Pain : మెడనొప్పితో బాధపడుతున్నారా! కారణాలు తెలుసా?
-
PM Modi: ద్రవ యూరియా ప్లాంట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ: పరిశ్రమలో ఎన్నో ప్రత్యేకతలు
-
Coffee : కాఫీ తాగితే ఉత్తేజం కలుగుతుందా?
-
PM Modi: భారతీయులు సిగ్గుతో తలలు వంచుకునేలా ఎలాంటి పని చేయలేదు: ప్రధాని మోదీ
-
Venkatesh: వెంకటేష్ నెక్ట్స్ మూవీ.. మరింత ఆలస్యం..?
-
Tirumala Rush: తిరుమలలో పోటెత్తిన భక్తజనం: భక్తులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలన్న టీటీడీ అధికారులు
-
Drumstick Leaves : పెరుగులో ఉండే ప్రొటీన్స్ కంటే మునగలో అధికమా!