AP Corona : ఏపీలో ఒక్కరోజే 12,926 కరోనా కేసులు, ఆరు మరణాలు నమోదు

రాష్ట్రంలో ప్రస్తుతం 73,143 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వైరస్ బారిన పడి ఇప్పటివరకు రాష్ట్రంలో 14,538 మంది మృతి చెందారు. కరోనాతో విశాఖ జిల్లాలో ముగ్గురు మృతి చెందారు.

AP Corona : ఏపీలో ఒక్కరోజే 12,926 కరోనా కేసులు, ఆరు మరణాలు నమోదు

Ap Corona (2)

Updated On : January 22, 2022 / 5:59 PM IST

AP new corona cases and deaths : ఏపీలో కరోనా మళ్లీ కలకలం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజు వారి కేసులు పది వేలకు పైగా నమోదవుతున్నాయి. ఏపీలో ఇవాళ కొత్తగా 12,926 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి ఆరుగురు మృతి చెందారు. నిన్నటితో (13,212 కేసులు) పోల్చితే ఈరోజు 286 కేసులు తగ్గాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం 73,143 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వైరస్ బారిన పడి ఇప్పటివరకు రాష్ట్రంలో 14,538 మంది మృతి చెందారు. కరోనాతో విశాఖ జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో ఇద్దరు, తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందారు. విశాఖ జిల్లాలో 1959, చిత్తూరు జిల్లాలో కొత్తగా 1566 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Chain Snatcher Arrest : ముంబైలో పట్టుబడ్డ చైన్ స్నాచర్ ఉమేశ్ ఖాతిక్.. హైదరాబాద్‌లో 7 చైన్ స్నాచింగ్‌లు

ఏపీలో నిన్న 13,212 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్ బారిన పడి ఐదుగురు మృతి చెందారు. శుక్రవారం రాష్ట్రంలో 64,136 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో నిన్న విశాఖ జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. విశాఖ జిల్లాలో 2,244, చిత్తూరు జిల్లాలో కొత్తగా 1,585 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.