Indrakeeladri: ‘తిరుమల స్థాయిలో ఇంద్రకీలాద్రి.. రూ. 75 కోట్లతో అభివృద్ధి’

విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని.. పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్టు.. ఏపీ ఎండోమెంట్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చెప్పారు.

Indrakeeladri: ‘తిరుమల స్థాయిలో ఇంద్రకీలాద్రి.. రూ. 75 కోట్లతో అభివృద్ధి’

Vellampallai

విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని.. పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్టు.. ఏపీ ఎండోమెంట్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. దసరా శరన్నవరాత్రులకు.. ఇంద్రకీలాద్రిపై పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామన్నారు.

క్యూలైన్లు, కేశ ఖండన కేంద్రంతో పాటు.. అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ.. భక్తులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని తెలిపారు. గత ఏడాది దసరా సందర్భంగా.. కొండ చరియలు విరిగిపడ్డాయని గుర్తు చేసిన మంత్రి.. అలాంటి సమస్యలు మళ్లీ రాకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

రాష్ట్రంలో తిరుమల తర్వాత ఆ స్థాయిలో కనకదుర్గమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని.. ప్రభుత్వం 75 కోట్ల రూపాయలు కేటాయించిందని మంత్రి తెలిపారు. నవరాత్రుల్లో భాగంగా.. ముఖ్యమంత్రి జగన్.. మూలా నక్షత్రం రోజున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు.