Byreddy Siddhartha Reddy : జగన్ మ్యానిఫెస్టో ఎట్టుంటదో తెలుసా..? అది విన్న జనం రియాక్షన్ చూస్తారుగా..
మొన్నటి వరకు ఐటీ, రాజధాని అంటూ చంద్రబాబు ఏవేవో చెప్పారు.చంద్రబాబు, పవన్ ది ఇద్దరిని ఒకేటే దారి.తల్లకిందులుగా తపస్సు చేసిన టీడీపీ మళ్లీ అధికారంలోకి రాదు.

Byreddy Siddhartha Reddy
Byreddy Siddhartha Reddy : త్వరలో రానున్న ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు మహానాడులో ప్రకటించిన మ్యానిఫోస్టో విని జగన్, వైసీపీ నేతలకు గుబులు పట్టుకుందంటే టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. మరి జగన్ ఎన్నికల మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో తెలుసా? అది విన్న ప్రజల స్పందన ఎలా ఉంటుందో చూడండీ అంటూ వ్యాఖ్యానించారు ఏ.పి శ్యాఫ్ చైర్మెన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. TDP మ్యానిఫోస్టోను తలదన్నేలా ఉంటుందని ధీమాను వ్యక్తంచేశారు బైర్రెడ్డి. చంద్రబాబు ప్రకటించిన మ్యానిఫెస్టో విడుదలతో వైసీపీ గెలుపు ఖరారైందని..సీఎం జగన్ తలపై పాలు పోసినట్టుగా టీడీపీ మ్యానిఫెస్టో అని అన్నారు.
మొన్నటి వరకు ఐటీ, రాజధాని అంటూ చంద్రబాబు ఏవేవో చెప్పారనీ..కానీ ఇప్పుడు జగన్ బాటలోనే మేమూ సంక్షేమం ఇస్తామంటున్నారని చంద్రబాబు, పవన్ ది ఇద్దరిని ఒకేటే దారి అంటూ విమర్శించారు.తల్లకిందులుగా తపస్సు చేసిన టీడీపీ మళ్లీ అధికారంలోకి రాదని అన్నారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ హోదా తెస్తామని లోకేశ్ తన పాదయాత్రలో ప్రకటించారని దీన్ని ప్రజలు ఎలా నమ్ముతారు?అంటూ తీవ్రంగా స్పందించారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఈ సందర్భంగా టీడీపీ మ్యానిఫెస్టో గురించి వ్యాఖ్యలు చేశారు. జగన్ మ్యానిఫోస్టో ఎలా ఉంటుందో చూద్దురుగాని అంటూ వ్యాఖ్యానించారు.
రాయలసీమకు అసలైన ద్రోహి చంద్రబాబు నాయుడేనని సీమ నీళ్లు ఎత్తుకెళ్లారు.. యూనివర్శిటీలకు లైసెన్సులు క్యాన్సిల్ చేశారు అంటూ విమర్శించారు. చంద్రబాబు పేరుతో రాయలసీమ భయపడే పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. 600హామీలు ఇచ్చి.. మ్యానిఫెస్టోనే మాయం చేశారని అన్నారు. మేము రెడ్లకు న్యాయం చేయలేదంటున్నారు ..మరి మీ హయాంలో ఏ కులానికి న్యాయం చేశారో చెప్పండి అంటూ ప్రశ్నించారు. కనీసం మైనార్టీ మంత్రిత్వశాఖకు మైనార్టీని మంత్రి చేయలేదని విమర్శించారు. ఏ నియోజకవర్గానికి వెళ్లినా అక్కడి ఎమ్మెల్యే 500కోట్లు అవినీతి అంటారు..మేము నిరూపిస్తామంటూ ఎక్కడ ముందుకురారని ఒక నియోజకవర్గంలో గొడవలు పెట్టి.. ఇంకో నియోజకవర్గంలోకి వెళ్తారు అంటూ విమర్శలు సంధించారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.