AP : బ్యాక్ టు స్కూల్, మోగనున్న బడి గంటలు..నిబంధనలివే

మూతపడిన స్కూళ్లు తెరుచుకోనున్నాయి. 2021, ఆగస్టు 16వ తేదీ సోమవారం నుంచి ఏపీలో పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

AP : బ్యాక్ టు స్కూల్, మోగనున్న బడి గంటలు..నిబంధనలివే

Ap Schools

AP Schools Reopen : బడి గంటలు మోగడానికి వేళ్లైంది. కరోనా కారణంగా…మూతపడిన స్కూళ్లు తెరుచుకోనున్నాయి. 2021, ఆగస్టు 16వ తేదీ సోమవారం నుంచి ఏపీలో పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ స్కూళ్లు తెరవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 61 వేల ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెట్‌ పాఠశాలల్లో 70 లక్షల మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. కరోనా వ్యాప్తి కారణంగా విద్యాలయాలు ప్రత్యేక జాగ్రత్తలతో తెరచుకోనున్నాయి.

Read More : PM Narendra Modi : సెల్యూట్, జెండా ఆవిష్కరించిన మోదీ..హెలికాప్టర్ల పూల వర్షం

ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతి సెక్షన్‌కు 20 మంది విద్యార్థులు మించకుండా తరగతులు నిర్వహించాలని తెలిపింది. అలాగే ప్రతి విద్యార్థి మాస్క్‌ ధరించడం, శానిటైజ్‌ చేసుకోవడం తప్పనిసరిగా పేర్కొంది. అటు ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఎప్పటికప్పుడు కోవిడ్‌ టెస్ట్‌లు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటికే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు యుద్ధప్రాతిపదికన వ్యాక్సిన్లు వేయించే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.

Read More : Goa: పంద్రాగస్టు రోజున వేడుకలు జరుపుకోని గోవా.. ఎందుకో తెలుసా?

ఇక ఉపాధ్యాయులను అత్యంత సమర్ధవంతంగా ఉపయోగించుకోవడం నూతన విధానంలో ప్రధాన లక్ష్యమన్నారు ఏపీ సీఎం జగన్. కొత్త విధానంలో 5వ తరగతి వరకు 18 సబ్జెక్టులను బీఈడీ, పీజీ చేసిన ఉపాధ్యాయులతో బోధన అందించబోతున్నామన్నారు. పౌండేషన్‌ స్కూల్స్, నూతన విద్యా విధానంపై ఉపాధ్యాయ సంఘాలు, పిల్లల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. నాడు-నేడు, నూతన విద్యావిధానంకోసం సుమారు 16వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, దీని ద్వారా సాధించబోయే లక్ష్యాలు స్పష్టంగా ఉండాలన్నారు జగన్‌.