AP Special Status: తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్రం ప్రత్యేక దృష్టి..వివాదాల పరిష్కారానికి ముగ్గురు సభ్యుల కమిటీ
ఏపీ ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. కేంద్ర హోంశాఖ ఎంజెండాలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చారు. విభజన సమస్యలపై వివాదంపై ముగ్గురు సభ్యులతో కమిటీ వేసింది

Ap Special Status Issue In Central Home Ministry Agenda Invitation For Discuss
AP Special Status in central home ministry agenda : తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. వివాదాల పరిష్కారానికి ముగ్గురు సభ్యలతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సభ్యులుగా కేంద్ర హోమ్ శాఖ సంకుక్త కార్యదర్శి అశిశ్,ఏపీ ఫైనాన్స్ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, తెలంగాణ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశం అని తేల్చి చెప్పిన కేంద్రం హోంశాఖ ఎజెండాలో ప్రత్యేక హోదా విషయాన్ని చేర్చింది. ఏపీ ప్రత్యేక హోదాతో పాటు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. దీంట్లో భాగంగానే కేంద్రం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ వేసింది.
తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై దృష్టి సారించిన కేంద్ర హోం శాఖ.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కేంద్ర హోం శాఖ లేఖలు రాసింది. ఈ నెల 17 విభజన సమస్యలపై సమావేశం నిర్వహించనున్నట్టుగా తెలిపింది. పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది.
ఫిబ్రవరి 8న జరిగిన సమావేశంలో కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర హోం శాఖ.. కమిటీలో సభ్యులుగా ఏపీ నుంచి ఎస్‌ఎస్ రావత్, తెలంగాణ నుంచి రామకృష్ణారావును నియమించింది. ఈనెల 17న ఉదయం 11 గంటలకు కమిటీ తొలి భేటీ నిర్వహణకు సిద్దమైంది. దీనిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు. షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజన, ఆస్తుల పంపకాలపై, ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆర్థికపరమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
కమిటీ సమావేశంలో ఎజెండాలోని కీలక అంశాలు..
1. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై చర్చ..
2.ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన..
3. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ సమస్యల పరిష్కారం..
4.పన్నుల వ్యవహారంపై చర్చ..
5.క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ డిపాజిట్ విభజన..
6.వనరు వ్యత్యాసరంపై చర్చ..
7.రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి గ్రాంట్ పై చర్చ..
8.పన్నుల ప్రోత్సాహాలు..
9.సివిల్ సప్లైస్ కార్పొరేషనల మధ్య క్యాష్ క్రెడిట్ పై చర్చ..
ఇలా పలు కీలక అంశాలు సమావేశంలో చర్చించనున్నారు.