Atmakur Bypoll: నేడు ఆత్మకూరు ఉపఎన్నిక.. బరిలో ఎంత మంది అంటే..

శ్రీపొట్టి శ్రీరాములు (ఎస్‌పీఎస్‌ఆర్‌) నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక గురువారం ప్రారంభమైంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్ ప్రశాంత నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Atmakur Bypoll: నేడు ఆత్మకూరు ఉపఎన్నిక.. బరిలో ఎంత మంది అంటే..

Bypool

Atmakur Bypoll: శ్రీపొట్టి శ్రీరాములు (ఎస్‌పీఎస్‌ఆర్‌) నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక గురువారం ప్రారంభమైంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్ ప్రశాంత నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుంచి గెలుపొంది ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 21న మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఖాళీ అయిన ఆత్మకూరు నియోజకవర్గానికి నేడు పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ నిర్ణయించింది.

Atmakur Bypoll: ఆత్మకూరు ఉప ఎన్నికకు ముగిసిన ప్రచారం.. వైసీపీ-బీజేపీల మధ్యే పోటీ

ఉప ఎన్నిక బరిలో 14మంది అభ్యర్థులు ఉన్నారు. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి పోటీచేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా భరత్‌కుమార్, బీఎస్పీ అభ్యర్థిగా న్యాయవాది ఓబులేసుతో సహా మరో 11మంది పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,13,400 మంది ఓటర్లు ఉన్నారు. వీరు ఓటు హక్కును వినియోగించుకొనేందుకు అధికారులు 279 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 363 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, 391 వీవీ ప్యాట్స్ ను పంపిణీ చేశారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు అధికారులు ఏర్పాటు చేశారు.

Chandrababu On Atmakur ByElection : ఆత్మకూరు ఉపఎన్నిక… టీడీపీ పోటీపై చంద్రబాబు క్లారిటీ

పోలింగ్ విధుల్లో మొత్తం 1,409 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఉప ఎన్నికకు 72 గంటల ముందుగానే బయట ప్రాంతాలకు చెందిన నాయకులు, ఇతర వ్యక్తులు ఎవరు లేకుండా చర్యలు తీసుకున్నారు. పోలింగ్ నేపథ్యంలో మూడు మిలిటరీ బెటాలియన్లు, ఆరు పోలీస్ స్పెషల్ ఫోర్స్ టీమ్, ముగ్గురు డీఎస్పీలు, 18మంది సీఐలు, 36మంది ఎస్​ఐలు,900 మంది స్థానిక పోలీసు సిబ్బందితో కలిపి.. మొత్తం సుమారు రెండు వేల మంది పోలీసు సిబ్బందిని ఈ ఎన్నికల పర్యవేక్షణకు సిద్ధం చేశారు. ఈ ఉప ఎన్నిక ఫలితాలు జూన్ 26న వెల్లడి కానున్నాయి.