Atmakur Bypoll: ఆత్మకూరు ఉప ఎన్నికకు ముగిసిన ప్రచారం.. వైసీపీ-బీజేపీల మధ్యే పోటీ

ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గౌతం రెడ్డి (వైసీపీ), గత ఫిబ్రవరిలో మరణించడంతో ఈ స్థానం ఖాళీ అయింది. వైసీపీ నుంచి దివంగత గౌతం రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ పోటీ చేస్తున్నారు.

Atmakur Bypoll: ఆత్మకూరు ఉప ఎన్నికకు ముగిసిన ప్రచారం.. వైసీపీ-బీజేపీల మధ్యే పోటీ

Atmakur Bypoll

Atmakur Bypoll: నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు సంబంధించిన ప్రచార పర్వం ముగిసింది. మంగళవారం సాయంత్రానికి అభ్యర్థులు, పార్టీలు తమ ప్రచారాన్ని ముగించుకున్నారు. ఈ ఉప ఎన్నిక బరిలో 14 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే, ప్రధానంగా వైసీపీ-బీజేపీ మధ్యే పోటీ నెలకొంది.

Tiger Search: ఇంకా చిక్కని పులి.. కొనసాగుతున్న గాలింపు

ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గౌతం రెడ్డి (వైసీపీ), గత ఫిబ్రవరిలో మరణించడంతో ఈ స్థానం ఖాళీ అయింది. తాజాగా ఈ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. వైసీపీ నుంచి దివంగత గౌతం రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరితోపాటు నియోజకవర్గంలోని మిగతా అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. వైసీపీ తరఫున ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ముమ్మర ప్రచారం నిర్వహించారు. వైసీపీ అభ్యర్థి దాదాపు లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తాడని వైసీపీ మంత్రులు నమ్ముతున్నారు. మరోవైపు బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు, రాష్ట్ర నేతలు ప్రచారం నిర్వహించారు. ఈ సారి గెలుపు తథ్యమని బీజేపీ భావిస్తోంది. ఈ నెల 23న అంటే గురువారం పోలింగ్ జరగనుంది.

Car Accident: టైరు పేలి ట్రక్కును ఢీకొన్న కారు… ఐదుగురు మృతి

26న ఓట్ల లెక్కింపు జరగనుంది. 278 కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. 122 కేంద్రాలను సమస్యాత్మకంగా ఎన్నికల అధికారులు గుర్తించారు. మొత్తం ఓటర్లు 2,13,338 మంది. కాగా, ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లను ఎలక్షన్ కమిషనర్, కలెక్టర్, ఎస్పీ పరిశీలిస్తున్నారు.