Tiger Search: ఇంకా చిక్కని పులి.. కొనసాగుతున్న గాలింపు

తాజాగా పులి.. తాడ్వాయి వైపు వెళ్లి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా వెళ్తే విశాఖ మన్యం వైపు చేరే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అటవీ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

Tiger Search: ఇంకా చిక్కని పులి.. కొనసాగుతున్న గాలింపు

Tiger Search

Tiger Search: కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలో నెల రోజులకు పైగా అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న పులి జాడ ఇంకా దొరకలేదు. శంఖవరం మండలం కొత్తమూరి పేట, లొద్దిపాలెంలో ఏర్పాటు చేసిన బోను దగ్గరకు పది రోజుల క్రితం వచ్చిన పులి, బోనులో చిక్కకుండానే తిరిగి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి మళ్లీ పులి కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Venkaiah Naidu: వెంకయ్య దారెటు? రాష్ట్రపతి అభ్యర్థా..? ఉప రాష్ట్రపతిగా కొనసాగింపా?

తాజాగా పులి.. తాడ్వాయి వైపు వెళ్లి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా వెళ్తే విశాఖ మన్యం వైపు చేరే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అటవీ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ రెస్క్యూ టీం సీసీ కెమెరాలు, బోనులు ఏర్పాటు చేసి నెల రోజులుగా పులిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. టాంక్విలైజర్ గన్ వాడి పులిని స్పృహ తప్పించైనా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నెల రోజులుగా పులి ఒక కారిడార్ ఏర్పాటు చేసుకుని తిరుగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పులి సంచరిస్తున్న లబ్బర్తి రిజర్వ్ ఫారెస్ట్‌ను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.

Car Accident: టైరు పేలి ట్రక్కును ఢీకొన్న కారు… ఐదుగురు మృతి

ఈ పులి ఒరిస్సా నుంచి నాగుల కొండ మీదుగా వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. పులిని పట్టుకునేందుకు అవసరమైతే ఇతర రాష్ట్రాలకు చెందిన షూటర్ల సాయం కూడా తీసుకోవాలని భావిస్తున్న అధికారులు టీసీఏకి ప్రతిపాదనలు పంపారు. మరోవైపు ఈ పులిని పట్టుకోవడానికి మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్ నుంచి ఒక బృందం రాబోతుంది.