Counting Of Votes : బద్వేల్ ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్ ప్రారంభం

ఏపీలోని కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. పట్టణ శివార్లలోని బాలయోగి గురుకుల పాఠశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Counting Of Votes : బద్వేల్ ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్ ప్రారంభం

Badvel (2)

Badwel by-election : ఏపీలోని కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు బద్వేల్ ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్  ప్రారంభం అయింది. పట్టణ శివార్లలోని బాలయోగి గురుకుల పాఠశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాలుగు కౌంటింగ్ హాల్స్ లో 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. కౌంటింగ్ మొదలైతే మూడు, నాలుగు గంటల్లోనే పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది.

తోలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలు పెట్టనుండగా.. మొత్తం 914 పోస్టల్ బ్యాలెట్స్ కు గాను 235 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్ లో 249 మంది సిబ్బంది పాల్గొననుండగా.. మొత్తం ఓట్లు 2,15, 292కు గాను.. మొత్తం పోలైన ఓట్లు 1, 46, 660. ఒకవైపు ఎన్నికల లెక్కింపు ప్రక్రియ మొదలు కానుండగా.. మరోవైపు జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తుంది. కౌంటింగ్ కు వర్షం ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉండడంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు చేసిన అధికారులు.. కేంద్ర పారా మిలటరీ దళాల తో పాటు నాలుగు వందల మందిపోలీసులుతో భద్రత ఏర్పాటు చేయడంతో పాటు కౌంటింగ్ కేంద్రానికి సమీపంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

Counting Of Votes : హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం.. మొదటగా పోస్టల్‌ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్

కౌంటింగ్‌ ప్రారంభమైన తొలి మూడు గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. మొత్తం 281 పోలింగ్ కేంద్రాలకు ఒకేచోట కౌంటింగ్‌ జరగనుందని ఎన్నికల అధికారులు తెలిపారు.. అభ్యర్థుల సమక్షంలోనే స్ట్రాంగ్‌ రూమ్‌లను తెరుస్తామని.. కొన్ని టేబుళ్ళకు రౌండ్ లు పెరిగే అవకాశం ఉందని.. సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో కౌంటింగ్ జరగనుందన్నారు. రౌండ్ వారీగా ఫలితాలను డిస్‌ ప్లే చేస్తామని.. వర్షం వల్ల కౌటింగ్ కు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.

ఎన్నికల బరిలో మొత్తం 15 మంది అభ్యర్థులు ఉండగా.. ప్రధానంగా వైసీపీ, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. బద్వేలులో 68.37 శాతం పోలింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే 8.25 శాతం పోలింగ్‌ తగ్గింది. ఈ ఎన్నికలో కచ్చితంగా తమదే గెలుపు అని వైసీపీ నేతలు భావిస్తున్నారు.. లక్ష మెజారిటీ సాధిస్తామని ధీమాగా ఉన్నారు. అయితే వైసీపీ అనుకున్నది అనుకునట్టు అన్నిసార్లు జరగదని కమలం నేతలు అంటున్నారు. కౌంటింగ్‌ ప్రారంభమైన మూడు గంటల్లో గెలుపెవరిది అన్న దానిపై క్లారిటీ రానుంది.