Bank Manager Suicide : వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక బ్యాంక్ మేనేజర్‌ ఆత్మహత్య

40 లక్షల రూపాయల అప్పులకు కోటిన్నర వడ్డీలు చెల్లించినట్టు నాగరాజు తన సూసైడ్‌ లెటర్‌లో తెలిపాడు. లక్ష రూపాయల అప్పుకు ప్రతిరోజూ 1000 వడ్డీ చెల్లించేవాడు. కొన్నిసార్లు వాటిని తీర్చలేక అవస్థలు పడ్డాడు.

Bank Manager Suicide : వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక బ్యాంక్ మేనేజర్‌ ఆత్మహత్య

Suicide (2)

Bank manager suicide : వందకు పది రూపాయలు.. వేయికి వంద రూపాయలు.. లక్షకు పదివేలు.. ఇది వడ్డీ వ్యాపారుల లెక్క. జనాల అవసరాలను ఆసరాగా చేసుకొని జలగల్లా పట్టి పీడిస్తున్న కథ. ఈ వడ్డీ రాక్షసుల దెబ్బకు చాలామంది బలి అవుతున్నారు. లక్షల రూపాయలకు కోటి రూపాయలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏలూరులో ఇలాగే 40 లక్షల అప్పు తీసుకొని కోటిన్నర వడ్డీ కట్టలేక ఉరి వేసుకున్నాడు ఓ వ్యక్తి. ఈ వడ్డీ భారం భరించలేనంటూ తనువు చాలించాడు.

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ప్రైవేట్‌ బ్యాంకు మేనేజర్‌ నాగరాజు ఉరి వేసుకున్నాడు. అప్పుల కుప్పకు తోడైన కొండంత వడ్డీని తీర్చలేక చనిపోయాడు. 40 లక్షల రూపాయల అప్పులకు కోటిన్నర వడ్డీలు చెల్లించినట్టు నాగరాజు తన సూసైడ్‌ లెటర్‌లో తెలిపాడు. లక్ష రూపాయల అప్పుకు ప్రతిరోజూ 1000 వడ్డీ చెల్లించేవాడు. కొన్నిసార్లు వాటిని తీర్చలేక అవస్థలు పడ్డాడు. బ్యాంక్‌లో సొమ్మును కూడా వాడుకున్నాడు. గోల్డ్‌ లోన్‌లలో కూడా తప్పులు చేశాడు. ఆ డబ్బంతా వడ్డీ వ్యాపారులకు కట్టాడు. బ్యాంకు సిబ్బందికి తెలియకుండా డబ్బును దారిమళ్లించాడు.

VRO Suicide : కాల్ మనీ వేధింపులు తాళలేక వీఆర్వో ఆత్మహత్య

సూసైడ్‌నోట్‌లో ఎవరెవరి దగ్గర ఎంతెంత అప్పు తీసుకున్న విషయాలను వివరంగా రాశాడు నాగరాజు. ఓ వ్యక్తి దగ్గర 2013లో 40 లక్షలు అప్పు తీసుకుంటే.. వడ్డీ పేరునే కోటి నలభై లక్షలు చెల్లించానని.. అయినా ఇంకా 16 లక్షలు ఇవ్వాలని వేధిస్తున్నాడని తెలిపాడు. ఇలా ఏడెనిమది మంది దగ్గర అప్పులు తీసుకున్నానని చెప్పుకొచ్చాడు. అలాగే తనకు 12 మంది నుంచి దాదాపు 65 లక్షలు రావాల్సి ఉన్నాయని.. వారు కూడా డబ్బు తిరిగి చెల్లించడం లేదన్నాడు.

ఇటు అప్పులు ఇచ్చిన వారు వేధిస్తున్నారని.. అందుకే చనిపోతున్నట్టు చెప్పాడు. కాల్‌మనీ, వడ్డీ వ్యాపారుల వేధింపులకు రోజుకో ప్రాణం బలి అవుతోంది. ఏలూరులో ఈ దందా జోరుగా సాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాగరాజు కుటుంబసభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.