KURNOOL BJP SABHA: బీజేపీ అంటే ఫ్లవర్ కాదు.. వైసీపీపై కమలదళం ఫైర్! | Bjp Leaders Fires at YCP in Kurnool Public Meet

KURNOOL BJP SABHA: బీజేపీ అంటే ఫ్లవర్ కాదు.. వైసీపీపై కమలదళం ఫైర్!

ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

KURNOOL BJP SABHA: బీజేపీ అంటే ఫ్లవర్ కాదు.. వైసీపీపై కమలదళం ఫైర్!

Kurnool Bjp Sabha: ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులను వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని సోము వీర్రాజు హాట్ కామెంట్స్ చేశారు. కర్నూలులో జరిగిన సభలో వైసీపీ నేతలపై కాషాయం నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ అంటే ఫ్లవర్ కాదని ఫైర్ అంటూ చెప్పుకొచ్చారు.

వైసీపీ ప్రభుత్వంపై కర్నూలులో బీజేపీ నేతలు డైలాగులు పేల్చారు. ఆత్మకూరులో బీజేపీ నేతలపై జరిగిన దాడులను రాష్ట్ర కమలదళం తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. బీజేపీ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టారని, కర్నూలులో నిర్వహించిన సభలో కాషాయ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం ఓట్ల కోసం వైసీపీ ప్రభుత్వం రాజకీయం చేస్తోందంటూ మండిపడ్డారు. వైసీపీ సర్కార్ హిందువులను తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఫైర్ అయ్యారు.

వైసీపీ ప్రభుత్వం.. ఏపీలో దమనకాండకు పాల్పడుతోందని ఆరోపించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్. ఆంధ్రప్రదేశ్ బీజేపీ వెనుక.. దేశంలోని కోట్లాది మంది బీజేపీ కార్యకర్తలు ఉన్నారని చెప్పారు.

బీజేపీ అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్ అంటూ మరోసారి పుష్ప డైలాగ్‌ పేల్చారు ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇంఛార్జ్‌ సునీల్ దియోధర్‌. నిప్పుతో చెలగాటమాడొద్దంటూ సీఎం జగన్‌ను హెచ్చరించారు. రాష్ట్రంలో దేవాలయ భూములను.. రాష్ట్ర ప్రభుత్వం అమ్మాలని చూస్తోందని ఫైర్ అయ్యారు.

జగన్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి.. రాష్ట్రంలోని దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని.. బీజేపీ నేతలు విమర్శించారు. సంఘ విద్రోహక చర్యలను ప్రోత్సహిస్తే సహించేది లేదన్నారు. ఆత్మకూరులో అరెస్ట్ చేసిన బీజేపీ నేత శ్రీకాంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

×