Bonda Uma : వైసీపీ నేతల ఎర్రచందనం స్మగ్లింగ్ వల్లే.. చిరుతలు నడక మార్గంలోకి వస్తున్నాయి : బోండా ఉమా
ఏపీలో ఈ నాలుగున్నరేళ్ల కాలంలో రూ. 10 లక్షల కోట్ల మేర దోచుకున్నారని ఆరోపించారు. తాగుబోతుల జేబులను కొట్టేసేన వైసీపీ.. చంద్రబాబుని విమర్శిస్తారా అని ప్రశ్నించారు. జగన్ చెప్పే ప్రతిమాట అబద్దమేనని పేర్కొన్నారు.

Bonda Uma Maheswara Rao (1)
Bonda Uma Maheswara Rao Allegations YCP : తిరుమలలో చిరుతల సంచారంపై వైసీపీ నేతలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వర రావు సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ నేతల ఎర్రచందనం స్మగ్లింగ్ వల్లే చిరుతలు నడక మార్గంలోకి వచ్చేస్తున్నాయని ఆరోపించారు. వైసీపీలో పుష్పాలు ఎక్కువయ్యారని పేర్కొన్నారు. వైసీపీ పుష్పాలు ఎర్రచందనం స్మగ్లింగ్ యధేచ్ఛగా చేస్తున్నారని విమర్శించారు.
ఎర్ర చందనం కోసం భారీగా అడవులు నరికేయడం వల్లే చిరుతలు తిరుమల మెట్ల మార్గంలోకి వచ్చేస్తున్నాయని పేర్కొన్నారు. చిరుతపులిని తరమడానికి బ్రహ్మాండమైన రూళ్ల కర్ర ఇస్తారట.. భక్తులకు సరైన సమాధానం చెప్పుకోలేక రూళ్ల కర్ర ఇస్తామంటారా అని ప్రశ్నించారు. అసమర్ధతను కప్పి పుచ్చుకోవడానికి పిచ్చి మాటలు, తుగ్లక్ చేష్టలు చేస్తున్నారని విమర్శించారు.
Chandrababu : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చంద్రబాబు మూడు రోజులు పర్యటన
ఆ రూళ్ల కర్రతో భక్తులు ప్రభుత్వానికి బడితే పూజ చేయాలని పిలుపునిచ్చారు. తాము విజన్ డాక్యుమెంట్ ఇచ్చామని, వైసీపీ ప్రిజన్ డాక్యుమెంట్ ఇస్తుందని ఎద్దేవా చేశారు. అభివృద్ధి ఎలా చేయాలనేది తమ విజన్ డాక్యుమెంటైతే, ఎంత మందిని జైళ్లకి పంపాలనేది వైసీపీ ప్రిజన్ డాక్యుమెంట్ అని విమర్శించారు. చంద్రబాబు అవినీతి చేశాడంటున్న వైసీపీ.. ఈ నాలుగున్నరేళ్లు ఏం చేశారని నిలదీశారు.
చంద్రబాబు అక్రమంగా ఒక్క రూపాయైనా దోచుకున్నారని వైసీపీ ఎందుకు నిరూపించ లేకపోయిందన్నారు. అమరావతిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారనే సొల్లు పురాణం ఎన్నాళ్లు చెబుతారని మండిపడ్డారు. ఎన్ని ఎంక్వైరీలు వేసుకున్నా చంద్రబాబు కాలి గోటిని కూడా టచ్ చేయలేకపోయారని పేర్కొన్నారు. చంద్రబాబు 420నా.. వైసీపీ వాళ్లంతా 840గాళ్లు అని అన్నారు.
Vangaveeti Radha Krishna : పెళ్లి పీటలు ఎక్కనున్న వంగవీటి రాధాకృష్ణ .. అమ్మాయి ఎవరంటే..
ఏపీలో ఈ నాలుగున్నరేళ్ల కాలంలో రూ. 10 లక్షల కోట్ల మేర దోచుకున్నారని ఆరోపించారు. తాగుబోతుల జేబులను కొట్టేసేన వైసీపీ.. చంద్రబాబుని విమర్శిస్తారా అని ప్రశ్నించారు. జగన్ చెప్పే ప్రతిమాట అబద్దమేనని పేర్కొన్నారు. జగన్ పని అయిపోయిందని అందుకే అబద్దాలు చెప్పి మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.