Chandrababu : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చంద్రబాబు మూడు రోజులు పర్యటన

మధ్యాహ్నం 2 గంటలకు రాజమండ్రి తొర్రేడు గ్రామం జిఎస్ఎన్ ఫంక్షన్ హాల్ నుండి రోడ్డు మార్గంలో మండపేట నియోజకవర్గంలోని ఏడిదకు చంద్రబాబు వెళ్లనున్నారు.

Chandrababu : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చంద్రబాబు మూడు రోజులు పర్యటన

Chandrababu Ambedkar Konaseema tour

Updated On : August 16, 2023 / 8:01 AM IST

Chandrababu Visit Ambedkar Konaseema : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజులు పర్యటించనున్నారు. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా నేడు (బుధవారం) మండపేట నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారు.

మధ్యాహ్నం 2 గంటలకు రాజమండ్రి తొర్రేడు గ్రామం జిఎస్ఎన్ ఫంక్షన్ హాల్ నుండి రోడ్డు మార్గంలో మండపేట నియోజకవర్గంలోని ఏడిదకు చంద్రబాబు వెళ్లనున్నారు. ఏడిదలో స్థానిక రైతులతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం మండపేటలో రోడ్ షో నిర్వహించి కలవపువ్వు సెంటర్ లో జరుగనున్న బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొనున్నారు.

రాత్రికి బాబు అండ్ బాబు ఫంక్షన్ హాల్లో చంద్రబాబు బస చేయనున్నారు. రెండో రోజు చంద్రబాబు కొత్తపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మూడోరోజు అమలాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.