Bhuma Akhila Priya Husband :ఫేక్ కరోనా సర్టిఫికెట్ పుట్టించిన మాజీమంత్రి అఖిలప్రియ భర్త

హైదరాబాద్ హఫీజ్ పేట భూములు వ్యవహారంలో ప్రవీణ్ రావు సోదరులను కిడ్నాప్ చేసిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ రెండో సారి పోలీసులకు దొరికిపోయాడు.

Bhuma Akhila Priya Husband :ఫేక్ కరోనా సర్టిఫికెట్ పుట్టించిన మాజీమంత్రి అఖిలప్రియ భర్త

Another Case Booked On Akhila Priya Husband

Updated On : July 10, 2021 / 12:08 PM IST

Bhuma Akhila Priya Husband : హైదరాబాద్ హఫీజ్ పేట భూములు వ్యవహారంలో ప్రవీణ్ రావు సోదరులను కిడ్నాప్ చేసిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ రెండో సారి పోలీసులకు దొరికిపోయాడు. నకిలీ కరోనా పాజిటివ్ సర్టిఫికెట్ సమర్పించి  న్యాయ విచారణకు హజరు కాకుండా తప్పించుకున్నాడని   అతనిపై   బోయినపల్లి పోలీసు స్టేషన్ లో కేసు నమోదయ్యింది.  ప్రవీణ్ రావు సోదరులు అపహణ కేసులో  న్యాయస్ధానానికి హాజరుకావటం ఇష్టంలేని అతను…. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని పోలీసులను తప్పుదోవ పట్టించాడు. నిజంగానే కరోనా పాజిటివ్ వచ్చిందని నమ్మారు పోలీసులు. కానీ… ఆ సర్టిఫికెట్ పై విచారణ చేపట్టగా అది ఫేక్ సర్టిఫికెట్ అని తేలింది. దీంతో రిపోర్టు ఇచ్చిన గాయత్రి ల్యాబరేటరీ లైసెన్స్ రద్దు చేయాలని వైద్య ఆరోగ్య శాఖకు లేఖ  రాశారు.

ఇలా దొరికిపోయాడు
కోర్టు విచారణకు హాజరు కాలేనంటూ భార్గవరామ్ గత శనివారం బోయినపల్లి ఇన్ స్పెక్టర్ రవికుమార్ కు వాట్సప్ లో మెసేజ్ పంపించాడు.  న్యాయస్ధానంలో ఈ విషయం వివరించేందుకు ఎస్సై ఈ సర్టిఫికెట్ ను తన ఉన్నతాధికారులకు పంపించాడు. అది చూసిన  ఉన్నతాధికారులు అందులో పేర్లు , అక్షరాలలో దిద్దుబాట్లు ఉన్నట్లు గుర్తించారు.   వెంటనే రిపోర్టు ఇచ్చిన కూకట్ పల్లిలోని గాయత్రీ ల్యాబరేటరీకి వెళ్లి ల్యాబ్ నిర్వాహకులు  వినయ్, రత్నాకర రావులను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో వివరించారు. రూ. 1200 తీసుకుని పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చినట్లు వారు వివరించారు.

ప్లాన్ వేసిన బావమరిది
భార్గవ్ రామ్ కు కరోనా పాజిటివ్ సర్టిఫికెట్ రావటానికి అఖిల ప్రియ తమ్ముడు జగద్విఖ్యాత్ రెడ్డి 10 రోజుల క్రితమే ప్లాన్ వేశాడు. కూకట్ పల్లిలోని   ప్రతిమ ఆస్పత్రిలో పని చేస్తున్నవినయ్  అనే వ్యక్తి తనకు తెలుసని అతడికి  చెబితే పనై పోతుందని…అడిగినంత డబ్బు ఇచ్చేద్దామని చెప్పాడు. వినయ్ సూచన మేరకు భార్గవ్ రామ్ గాయత్రి ల్యాబరేటరీకి వెళ్లాడు. అక్కడ కోవిడ్ పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. అయినా వారు పాజిటివ్ అని తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చారు.

ల్యాబ్ లో విచారణ జరిపిన పోలీసులు  మొత్తం వ్యవహరాన్ని కూపీ లాగారు. భార్గవ రామ్ ల్యాబ్ కు ఎప్పుడు వచ్చాడు. ఏమి ఏమి చేశాడు, నమూనాలు ఏలా మార్చారు. తదితర అంశాలకు సంబంధించి మొత్తం సీసీటీవీ ఫుటేజిని పరిశీలించారు. ఒక నమూనా బదులు వేరోక నమూనా ఉంచటం…కోవిడ్ రిపోర్ట్ పై పాజిటివ్ అని రాయటం వంటి వాటి ఆధారాలు సేకరించారు. పరారీలో ఉన్నభార్గవ్ రామ్, జగద్విఖ్యాత రెడ్డిల కోసం పోలీసులు గాలిస్తున్నారు.