Gannavaram Pastor : చనిపోయి మళ్లీ 3 రోజుల్లో బతికి వస్తా, గన్నవరంలో పాస్టర్ వింత చేష్టలు

కృష్ణా జిల్లా గన్నవరంలో పాస్టర్ నాగభూషణం తన వింత చేష్టలతో అందరినీ కంగారు పెట్టిస్తున్నారు. పది రోజుల్లో చనిపోయి సమాధి నుంచి తిరిగొస్తానంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయించారు.

Gannavaram Pastor : చనిపోయి మళ్లీ 3 రోజుల్లో బతికి వస్తా, గన్నవరంలో పాస్టర్ వింత చేష్టలు

Gannavaram Pastor : కృష్ణా జిల్లా గన్నవరంలో పాస్టర్ నాగభూషణం తన వింత చేష్టలతో అందరినీ కంగారు పెట్టిస్తున్నారు. పది రోజుల్లో చనిపోయి సమాధి నుంచి తిరిగొస్తానంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయించారు. గొల్లనపల్లిలోని తన స్థలంలో సమాధి కోసం గొయ్యి తవ్వించిన పాస్టర్.. పది రోజుల్లో తాను చనిపోతే ఇదే సమాధిలో పెట్టాలని, మూడు రోజుల్లో మళ్లీ బతికొస్తానంటూ కుటుంబసభ్యులకు పాస్టర్ చెప్పారు. పాస్టర్ నాగభూషణం వైఖరితో కుటుంబసభ్యులు, గ్రామస్తులు కంగారుపడుతున్నారు.

”నేను పది రోజుల్లో చనిపోతాను. సమాధిలో నన్ను భద్రపరచండి. క్రీస్తు లాగే చనిపోయిన మూడు రోజుల్లో నేను కూడా బతికి వస్తాను” అంటూ గ్రామంలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేయించారు పాస్టర్ నాగభూషణం. అంతేకాదు సమాధి కూడా తీయించాడు. దీంతో గ్రామంలో భయాందోళన నెలకొంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

చనిపోయిన వ్యక్తి మళ్లీ లేవటం ఏంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. క్రీస్తు అంటే నమ్మకం లేని వాళ్లే ఇలా మాట్లాడతారని పాస్టర్ ఎదురు దాడికి దిగారు. మూడు రోజుల్లో నేను బతికి వస్తాను, నా మహిమలు చూపిస్తాను అని పదే పదే చెబుతున్నారు.

కాగా, అసలేం జరుగుతుందో అర్థం కాక గ్రామస్తులు కంగారు పడుతున్నారు. అయితే, నేను చెప్పింది నిజం, నన్ను నమ్మండి అంటున్నారు పాస్టర్ నాగభూషణం. కాగా, ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం ఆయన మాటలు, చేష్టలే. కొన్ని రోజులుగా పాస్టర్ నాగభూషణం వింతగా వ్యవహరిస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు.