Ongole : చాలా కోపం వస్తోంది.. వైసీపీ ప్రభుత్వంపై బాబు సంచలన వ్యాఖ్యలు

ఆర్టీఏ అధికారులు వచ్చి సీఎం కోసం కారును తీసుకెళ్లామని తీరిగ్గా చెప్పారని..ఎవరైనా అమ్మాయి కావాలని కోరుకుంటే ఇళ్లల్లో వచ్చి మహిళలను ఎత్తుకుపోతారా..? అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు...

Ongole : చాలా కోపం వస్తోంది.. వైసీపీ ప్రభుత్వంపై బాబు సంచలన వ్యాఖ్యలు

Chandrababu

Cm Jagan Convoy Issue : వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే చాలా కోపం వస్తోంది…అయినా.. సభ్యత అడ్డం వచ్చి సంయమనం పాటిస్తున్నట్లు తెలిపారు. ఒంగోలు ఆర్టీఏ అధికారుల తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. సీఎం జగన్ కాన్వాయ్ కోసం భక్తుల కారు తీసుకోవడంపై బాబు స్పందించారు. అధికారుల వ్యవహార శైలిని ఎండగట్టారు. 2022, ఏప్రిల్ 21వ తేదీ గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో పోలీసులు దొంగల మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో భక్తుడు టీ తాగుదామని ఆగితే.. పోలీసు కానిస్టేబుల్ వచ్చి కారును తీసుకెళ్లిపోయాడన్నారు.

Read More : Andhra pradesh: ఒంగోలులో భక్తుల కారు తీసుకెళ్లిన ఘటనపై ప్రభుత్వం సీరియస్.. ఏవీఎం, హోంగార్డు సస్పెన్షన్

అనంతరం ఆర్టీఏ అధికారులు వచ్చి సీఎం కోసం కారును తీసుకెళ్లామని తీరిగ్గా చెప్పారని..ఎవరైనా అమ్మాయి కావాలని కోరుకుంటే ఇళ్లల్లో వచ్చి మహిళలను ఎత్తుకుపోతారా..? అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆస్తులకు.. మహిళల శీలాలకు వైసీపీ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. రాజకీయాల్లో వైసీపీ ఉండదగ్గ పార్టీ కాదని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఒంగోలు విషయానికి వస్తే…సీఎం జగన్ గురువారం పర్యటిస్తున్నారు. ఇందుకు పోలీసులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో పల్నాడు జిల్లా వినుకొండ నుండి వేముల శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఇన్నోవాలో వెళ్తున్నారు. బుధవారం రాత్రి 10గంటలకు అద్దంకి బస్టాండ్ వద్ద కారు ఆపి టిఫిన్ చేసేందుకు దిగారు.

Read More : CM Ys Jagan : మంత్రి పదవులకు వస్తాయనుకున్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు CM జగన్ ఎందుకు షాక్ ఇచ్చారు?!

సీఎం కార్యక్రమానికి కాన్వాయ్ కోసం డ్రైవర్ పాటు కారు కావాలంటూ ఒంగోలు ఆర్టీఏ పోలీసులు ఇన్నోవా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా అవాక్కయిన వేముల శ్రీనివాస్ మేము తిరుపతికి దర్శనకోసం వెళ్తున్నామని, తమది ఈ ప్రాంతం కాదని, తమను ఇబ్బంది పెట్టొద్దని ఆర్టీఏ పోలీసులను వేడుకున్నారు. మరో వెహికిల్ లభించే పరిస్థితి లేదని.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము ఇలా చేయాల్సి వస్తుందంటూ డ్రైవర్ తో సహా ఇన్నోవా కారును తీసుకెళ్లారు. దీనిపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులైన హోంగార్డు పి. తిరుపతిరెడ్డి, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.సంధ్యను సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రంలో కాక పుట్టిస్తోంది.