AP Cabinet : జగన్ టీం 2.0… మంత్రుల జాబితా ఖరారు

ఏపీ మంత్రుల తుది జాబితా ఖరారైంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు రాజ్ భవన్ కు కొత్త మంత్రుల జాబితాను పంపించనున్నారు. అనంతరం సాయంత్రం ఐదు గంటలకు లోపు...

AP Cabinet : జగన్ టీం 2.0… మంత్రుల జాబితా ఖరారు

Ap Cm Jagan

CM Jagan New cabinet : ఏపీ మంత్రుల తుది జాబితా ఖరారైంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు రాజ్ భవన్ కు కొత్త మంత్రుల జాబితాను పంపించనున్నారు. అనంతరం సాయంత్రం ఐదు గంటలకు లోపు.. మంత్రుల జాబితాను గవర్నర్ ఆమోదించనున్నారు. అంతకంటే ముందు.. మంత్రుల రాజీనామాలను ఆమోదించనున్నారు. ఇక మంత్రి పదవులు పొందిన వారిలో బోత్స సత్యనారాయణ, రాజన్న దొర, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, భాగ్యలక్ష్మి, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, కొండేటి చిట్టిబాబు, చెల్లుబోయిన వేణు, కారుమూరి నాగేశ్వరరావు, గ్రంధి శ్రీనివాస్, జోగి రమేష్, కొడాలి నాని, విడదల రజిని, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, కాకాని గోవర్ధన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజద్ బాషా, కోరుముట్ల శ్రీనివాస్, శిల్పా చక్రపాణిరెడ్డి, గుమ్మనూరు జయరాం, జొన్నలగడ్డ పద్మావతి, శంకర్ నారాయణలతో పాటు వేణుగోపాల్, రక్షణ నిధిల పేర్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. రాజ్ భవన్ నుంచి అధికారికంగా ప్రకటన విడుదల కావాల్సి ఉంది.

Read More : AP New Cabinet : కొత్త మంత్రివర్గం లిస్టు సిద్ధం.. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు

ఇదిలా ఉంటే.. కోర్ టీమ్ తో సీఎం జగన్ సమావేశమయ్యారు. చివరి నిమిషంలో మార్పులు చేసినట్లు సమాచారం. ఇక తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ పలువురు ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. లిస్టులో తమ పేరు ఉందా ? లేదా ? అనే టెన్షన్ లో వైసీపీ నేతలున్నారు. కొంతమంది గుళ్ల చుట్టూ మరికొంతమంది ఆశావాహులు తిరుగుతున్నారు.

Read More : AP Property Tax : ఏపీ ప్రజలకు మరో షాక్.. ఆస్తి పన్ను పెంపు

దాదాపు మూడు సంవత్సరాల తర్వాత కేబినట్ ను పునర్ వ్యవస్థీకరించారు. ఆయా జిల్లాల అవసరాలు, సామాజిక కూర్పు, వారి అనుభవం ఆధారంగా కొంతమందిని కొనసాగించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో మొత్తం 25 మంది సభ్యులున్నారు. ఇటీవలే పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. 24 మంది మంత్రులు స్వచ్చందంగా రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను ఆమోదించాలని సిఫార్సు చేస్తూ.. గవర్నర్ కు లేఖ పంపారు. వీటిని రాజ్ భవన్ ఆమోదించాక రాజ్ భవన్ అధికారికంగా ప్రకటన విడుదల చేయనుంది. ఇప్పటి దాక ఉన్నవారు 10 మంది కొనసాగుతారని, కొత్తగా 15 మందికి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. మంత్రులుగా పేర్లు ఖరారు అయిన వారికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ చేసి సమాచారం ఇస్తారని.. సోమవారం నాడు అందుబాటులో ఉండాలని చెబుతారని తెలుస్తోంది. వెలగపూడి తాత్కాలిక సచివాలయం ఒకటో పక్కన ఖాళీ ప్రదేశంలో వేదికను సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రులతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయిస్తారు.