CM Jagan : అన్ని విభాగాలు క్లీన్ కావాల్సిందే.. సీఎం జగన్ ఆదేశాలు

అవినీతి చోటు చేసుకుంటున్న విభాగాలను క్లీన్ చేయాల్సిందేనని, నెల రోజుల్లోగా ACBకి యాప్ రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎస్‌ఈబీకి ప్రత్యేక కాల్‌ సెంటర్‌...

CM Jagan : అన్ని విభాగాలు క్లీన్ కావాల్సిందే.. సీఎం జగన్ ఆదేశాలు

Ap Cm Jagan

CM jagan Review On Home Department : ఏపీ రాష్ట్రంలో అవినీతి లేకుండా చేయాలని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా పలు చర్యలు తీసుకుంటున్నారు. అయినా..అక్కడక్కడ అవినీతి ఘటనలు బయటకు వస్తున్నాయి. దీంతో సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతి ఫిర్యాదులకు ఏకంగా యాప్ రూపొందించాలని నిర్ణయం తీసుకుంది. లంచగొండి అవినీతి పరుల భరతం పట్టే ACBకి త్వరలోనే యాప్ రానుంది. ప్రత్యేకంగా యాప్ రూపొందించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

Read More : Chandrababu : చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ ఎమ్మెల్యే..!

2022, ఏప్రిల్ 20వ తేదీ బుధవారం హోం శాఖపై సీఎం రివ్యూ నిర్వహించారు. అవినీతి చోటు చేసుకుంటున్న విభాగాలను క్లీన్ చేయాల్సిందేనని, నెల రోజుల్లోగా ACBకి యాప్ రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎస్‌ఈబీకి ప్రత్యేక కాల్‌ సెంటర్‌ నంబర్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ యాప్ లో ఆడియోను కూడా ఫిర్యాదుగా పంపొచ్చు. నేర నిర్ధారణకు ఫోరెన్సిక్ విభాగాన్ని బలోపేతం చేయనున్నారు. మండలస్థాయి వరకు ఏసీబీ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇతర విభాగాల్లో అవినీతి ఫిర్యాదుల పైనా ఏసీబీ పర్యవేక్షణ చేయనుంది. డగ్స్‌ వ్యవహారాలకు రాష్ట్రంలో చోటు ఉండరాదని, వాటి మూలాల్లోకి వెళ్లి కూకటి వేళ్లతో పెకలించి వేయాలని ఆదేశించారు. ఇందుకు విద్యాసంస్థలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి
చీకటి ప్రపంచంలో వ్యవహారాలను నిర్మూలించాలన్నారు. ప్రతినెలా ఈ అంశాల్లో ప్రగతిని నివేదించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.