Chandrababu : చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ ఎమ్మెల్యే..!

చంద్రబాబు 73వ పుట్టిన రోజునాడు ఓ ఆసక్తిక సన్నివేశం జరిగింది. చంద్రబాబును కలిసి..జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే..

Chandrababu : చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ ఎమ్మెల్యే..!

Kamalapuram Ycp Mla Ra Vindranath Reddy Wished Chandrababu A Happy Birthday

Updated On : April 20, 2022 / 2:58 PM IST

YCP MLA Ra Vindranath Reddy wished Chandrababu : ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు 73వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు ఆయనకు బెస్ట్ విషెస్ తెలిపారు. పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గమ్మను టీడీపీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఓ ఆసక్తిక సన్నివేశం జరిగింది. అమ్మవారి దర్శనానికి వెళ్తున్న చంద్రబాబుకు కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి ఎదురయ్యారు. చంద్రబాబును ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి పలకరించారు. చంద్రబాబుకు కరచాలనం చేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.

అమ్మవారి దర్శనం అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. తాను తనకు, ప్రజలకు దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని చెప్పారు. తనకు ప్రజల పక్షాన పోరాడేందుకు శక్తి సామర్ధ్యాలు ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. ప్రజల ఇబ్బందులు తొలగించాలని వేడుకున్నానని.. తెలుగు జాతికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. తనకు తప్పకుండా జయం సాధిస్తాననే నమ్మకం ఉంది. రాజీలేని పోరాటం తో ప్రజలకు అండగా నిలబడతా.. అంటూ చంద్రబాబు చెప్పారు. ఇక నుంచి అభిమానులుకున్న అంచనాల ప్రకారం ముందుకెళ్తానని అన్నారు.