Andhra Pradesh : అలకవీడని మాజీ హోంమంత్రి సుచరితపై సీఎం జగన్ ఆగ్రహం..తీరు మారకుంటే చర్యలు తీసుకునే అవకాశం

అలకవీడని మాజీ హోంమంత్రి సుచరితపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆమె తీరు మారకుంటే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Andhra Pradesh : అలకవీడని మాజీ హోంమంత్రి సుచరితపై సీఎం జగన్ ఆగ్రహం..తీరు మారకుంటే చర్యలు తీసుకునే అవకాశం

Cm Jagan Serious Over Former Home Minister Sucharita.

AP EX Home minister Mekathoti Sucharita: సీఎం జగన్ కేబినెట్ పునర్ వ్యవవస్థీకరణ పలువురు అసంతృప్తులకు కారణమైంది. కొత్త క్యాబినెట్ లో స్థానం దక్కినవారు ఫుల్ ఖుషీగా ఉంటే..మంత్రి స్థానం కోల్పోయినవారు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. వారిలో మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత కూడా ఉన్నారు. తనను మంత్రిగా తీసివేయటంతో ఆమె అధిష్టానంపై అలకబూనారు. పైకి మాత్రం తనకు మంత్రి పదవి పోయినందుకు ఏమాత్రం బాధ లేదని చెబుతునే మరోపక్క తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం గమనించాల్సిన విషయం. దీంతో ఆమెను బుజ్జగించటానికి సీఎం జగన్ కొంతమందిని నియమించారు. అయినా సుచరిత మాత్రం వారిని కలవటానికి కూడా ఇష్టపడటంలేదు. సుచరితతో మాట్లాడటానికి సీఎం జగన్ స్వయంగా కబురు పంపించినా ఆమె తీరు మారలేదు. మాట్లాడటానికి సీఎం వద్దకు రాలేదు. దీంతో సీఎం జగన్ సుచరిత తీరుపై మండిపడుతున్నారు.

Also read : AP Cabinet : మంత్రి పదవి రానందుకు బాధ లేదు..వ్యక్తిగత కారణాల వల్లే ఎమ్మెల్యే పదవికి రాజీనామా : మాజీ హోంమంత్రి సుచరిత

దీంతో మరోసారి సీఎం కబురు పంపినా సుచరిత సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఆమెపై అధిష్టానం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా సీఎం జగన్ ఎవ్వరిని కలవరు..ఆఖరికి కొంతమంది మంత్రులు మినహా ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వరు. కానీ సుచరితతో మాట్లాడటానికి కబురు పంపించినా రాకపోవటంతో సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మరోసారి అధిష్టానం సుచరిత తీరుపై అధిష్టానం ఫుల్ సీరియస్ గా ఉంది.

కాగా..తనకు మరోసారి మంత్రి పదవి ఇవ్వకపోవటంపై అధిష్టానం ఎంతగా యత్నించినా పట్టు వీడటంలేదు. ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేసినా ఆమె తీరు మారలేదు. సుచరిత ఇంటికి వెళ్లిన మోపిదేవి.. సామాజిక సమీకరణాల వల్లే కేబినెట్‌లో చోటు కల్పించలేకపోయామని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆమెకు ఫోన్ చేసి, రమ్మని చెప్పారు. అయితే, అనారోగ్యం కారణంగా ఆమె వెళ్లలేదని ఆమె సన్నిహితులు చెప్పారు. వీరిద్దరు మినహా అధిష్ఠానం నుంచి సుచరితతో ఎవరూ మాట్లాడలేదని ఆమె అనుచరులు చెబుతున్నారు.

Also read : Nidhhi Agerwal : కండోమ్ యాడ్‌ని ప్రమోట్ చేసిన హీరోయిన్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సుచరిత వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పదవికి రాజీనామా చేసినా పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. సుచరితకు మంత్రి పదవి దక్కకపోవడంతో కార్యకర్తలు రెండు రోజులుగా గుంటూరులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.