CM Jagan : తిరుపతి శ్రీనివాస సేతు ఫ్లైఓవర్.. ప్రారంభించనున్న సీఎం జగన్
డి ఆంజనేయ స్వామి ఆలయం నుండి శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్లి సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు రాత్రి పెద్ద శేష వాహన సేవలో జగన్ పాల్గొననున్నారు. రాత్రి శ్రీ పద్మావతి అతిథి గృహంలో సీఎం జగన్ బస చేయనున్నారు.

CM Jagan Srinivasa Setu Flyover
CM Jagan – Srinivasa Setu Flyover : తిరుపతిలో నేడు శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు సీఎం జగన్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3.50 గంటలకు స్థానిక మ్యాంగో మార్కెట్ వద్ద శ్రీనివాస సేతు వంతెనను సీఎం ప్రారంభించనున్నారు. ఎస్.వి.ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనాల శిలాఫలకాల ఆవిష్కరణ చేసి టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్నారు.
సాయంత్రం 4.30 గంటలకు తిరుపతి తాతయ్యగుంట గంగమ్మను సీఎం జగన్ దర్శించుకోనున్నారు. తాతయ్యగుంట గంగమ్మ దర్శనం అనంతరం తిరుమలకు చేరుకోనున్నారు. సాయంత్రం 5.40 గంటలకు వకులమాత రెస్ట్ హౌస్ కు చేరుకోనున్నారు. సాయంత్రం 5.55 గంటలకు రచన రెస్ట్ హౌస్ ను సీఎం ప్రారంబించనున్నారు.
Nara Brahmani : వైసీపీ అసమర్థ పాలన, నిజాన్ని కూడా చూడలేని కపోదులు : నారా బ్రాహ్మణి
రాత్రి 7.45 గంటలకు బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుండి శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్లి సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు రాత్రి పెద్ద శేష వాహన సేవలో జగన్ పాల్గొననున్నారు. రాత్రి శ్రీ పద్మావతి అతిథి గృహంలో సీఎం జగన్ బస చేయనున్నారు. రేపు (మంగళవారం) ఉదయం 6.20 గంటలకు జగన్ శ్రీవారిని దర్శించుకోనున్నారు.