AP CM Jagan: క్లీన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా.. చెత్త సేకరణకు ఈ – ఆటోలు ప్రారంభించనున్న సీఎం జగన్.. మహిళా డ్రైవర్లకు ప్రాధాన్యం

చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే 516 విద్యుత్ ఆటోలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. 36 మున్సిపాలిటీలకు వీటిని అందజేస్తారు.

AP CM Jagan: క్లీన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా.. చెత్త సేకరణకు ఈ – ఆటోలు ప్రారంభించనున్న సీఎం జగన్.. మహిళా డ్రైవర్లకు ప్రాధాన్యం

CM Jagan

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్లీన్‌గా ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఈ క్రమంలో జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా చెత్తసేకరణకు ఈ-ఆటోలను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆటోలను సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించనున్నారు. చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే 516 విద్యుత్ ఆటోలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. 36 మున్సిపాలిటీలకు వీటిని అందజేస్తారు. ఒక్కో ఆటో విలువ రూ.4.10 లక్షలుకాగా, 500 కేజీల సామర్థ్యంతో వీటిని రూపొందించారు. ఆటోల కొనుగోలుకు ప్రభుత్వం రూ.21.18 కోట్లను వెచ్చించింది.

CM Jagan Polavaram Tour: దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను త్వరగా పూర్తిచేయాలి.. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం జగన్

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలను స్వచ్ఛంగా ఉండేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా పలు కార్యక్రమాలు చేపడుతుంది. ఇప్పటికే రూ. 72కోట్లతో 123 మున్సిపాలిటీల్లోని 40లక్షల కుటుంబాలకు ప్రభుత్వం తడి, పొడి, హానికర వ్యర్థాల సేకరణకు నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లోని లక్షల చెత్త బుట్టలను ప్రభుత్వం పంపిణీ చేసింది. గ్రేడ్ -1 ఆపై మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు 2,525 పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గార్బేజ్ టిప్పర్లను ప్రభుత్వం వినియోగిస్తోంది.

CM Jagan : టీడీపీ మేనిఫెస్టోపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

గుంటూరు, విశాఖపట్టణాలలో వేస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్టులను ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించింది. త్వరలో రోజుకు 400 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో మరో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. అదేవిధంగా 81 మున్సిపాలిటీల్లో రూ. 157 కోట్లతో 135 గార్బేజ్ ట్రాన్స్ ఫర్ స్టేషన్లు ప్రభుత్వం నిర్మిస్తుంది. పెద్ద, చిన్న మున్సిపాలిటీల్లో వీధులన్నీ శుభ్రంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇదిలాఉంటే చెత్తసేకరణలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్న ఈ ఆటోలకు డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.