Janasena : విందులు, వినోదాలు వద్దు..సంక్రాంతిని ఇంట్లోనే జరుపుకోండి..పవన్ కళ్యాణ్ సూచన

సంక్రాంతి పండుగను కూడా కుటుంబ సభ్యులతో మాత్రమే జరుపుకోడానికి ప్రయత్నించాలన్నారు. ఇప్పటి వరకు టీకా తీసుకొనేవారు తప్పనిసరిగా టీకా వేయించుకోవడంతో పాటు.. తరచూ చేతులు...

Janasena : విందులు, వినోదాలు వద్దు..సంక్రాంతిని ఇంట్లోనే జరుపుకోండి..పవన్ కళ్యాణ్ సూచన

Janasena

AP Coronavirus : కరోనా వైరస్ ఉధృతిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సెకండ్ వేవ్ లో మందులు, ఆక్సిజన్ దొరకక ఎంతో మంది ప్రజలు అల్లాడిపోయారన్నారు. ఎందరినో ఆ సమయంలో చాలా మందిని కోల్పోయామని, ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. తక్షణమే అప్రమత్తం కావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. 2022, జనవరి 10వ తేదీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచనలు చేశారు. అందుబాటులో ఉంటే డబుల్ మాస్క్ ధరించాలని, విందులు, సమావేశాలు వంటి వాటిని కొన్నాళ్లపాటు వాయిదా వేసుకోవడం ఉత్తమమనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన.

Read More : China Change 5 Lander : చంద్రుడిపై నీటిని కనుగొన్న చైనా వ్యోమనౌక

ఇప్పుడు వచ్చే సంక్రాంతి పండుగను కూడా కుటుంబ సభ్యులతో మాత్రమే జరుపుకోడానికి ప్రయత్నించాలన్నారు. ఇప్పటి వరకు టీకా తీసుకొనేవారు తప్పనిసరిగా టీకా వేయించుకోవడంతో పాటు.. తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం అలవాటుగా మార్చుకోవాలన్నారు. ఇటువంటి చిన్నచిన్న జాగ్రత్తలతో కరోనా ఉధృతాన్ని కొంతవరకు తగ్గించుకోగలమన్నారు. దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో యావత్ ప్రజానీకం అప్రమత్తమవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కరోనా బారిన పడుతున్న సంఖ్య దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న విషయం అందరికీ తెలిసిందేన్నారు.

Read More : Khammam Constable Suicide : ఖమ్మంలో విషాదం.. కొన్ని గంటల్లో నిశ్చితార్ధం.. కానిస్టేబుల్ ఆత్మహత్య !

దేశంలో ఒక్క రోజే లక్ష 80 వేల మందికి కరోనా సోకినట్లు గణాంకాలు తెలుపుతున్నాయని, అంతకు ముందు రోజు ఆ సంఖ్య లక్ష 59 వేలుగా ఉందంటే మహమ్మారి వేగంగా విస్తరిస్తోందని అందరూ గమనించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 12 వందలకు పైగా, తెలంగాణలో 15 వందలకు పైగా కేసులు నమోదయ్యాయని తెలిసిందని తెలిపారు. చూస్తుండగానే కరోనా సోకిన వారు మన చుట్టూ పెరుగుతున్నారని…దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా యాక్టీవ్ కేసులు 7.23 లక్షలు ఉన్నాయని వెల్లడించారు. ఈక్రమంలో…కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పినట్లు అందరూ అప్రమత్తంగా ఉండి ఈ మహమ్మారిని పారద్రోలుదామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.