ప్రాణం తీసిన పబ్జీ గేమ్…అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న డిగ్రీ స్టూడెంట్‌

  • Published By: bheemraj ,Published On : December 2, 2020 / 08:06 AM IST
ప్రాణం తీసిన పబ్జీ గేమ్…అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న డిగ్రీ స్టూడెంట్‌

pub game student suicide : పబ్జీ గేమ్‌ ప్రాణాలు తీస్తోంది. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా.. ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో.. పబ్జీకి అడిక్ట్‌ అయిన యువకులు ప్రాణాలు తీసుకుంటున్నారు. స్మార్ట్‌ ఫోన్‌లో పబ్‌జీ గేమ్‌కు యువత బానిసలు అవుతూ.. కన్నవారికి కాకుండా పోతున్నారు. ఆన్‌లైన్ గేమ్‌ పబ్జీకి అడిక్ట్‌ అయిపోయి.. పూర్తిగా సెల్‌ఫోన్‌లో మునిగిపోతున్నారు. తల్లిదండ్రులు ఏదో అన్నారని క్షణికావేశంలో కొందరు ఉసురు తీసుకుంటుంటే.. పబ్జీకి పూర్తి బానిసలుగా మరిన కొందరు లక్షలు పోగొట్టుకుని ప్రాణాలు కోల్పోతున్నారు.



తాజాగా చిత్తూరు జిల్లాలో పబ్జీ గేమ్‌ ఓ యువకుడి ప్రాణం తీసింది. పబ్‌జీ గేమ్‌ కోసం లక్షల్లో అప్పులు చేసిన డిగ్రీ స్టూడెంట్‌ యోగేశ్‌.. వాటిని ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నాడు.
https://10tv.in/gujarat-man-thefts-29-bikes-fulfill-his-wifes-demands/
వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లం గ్రామానికి చెందిన యోగేశ్‌.. చాలా కాలంగా పబ్జీకి బానిసయ్యాడు. రోజంతా పబ్‌జీ గేమ్‌ ఆడుకుంటూ కూర్చునేవాడు. ఈ క్రమంలో పబ్‌జీ కోసం తల్లిదండ్రుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు తీసుకున్నాడు.



అవి చాలకపోవడంతో స్నేహితులతో పాటు ఊళ్లో తెలిసినవాళ్ల దగ్గర కూడా అప్పులు చేశాడు. అప్పులన్నీ కలిపి 2 లక్షలు దాటిపోవడంతో యోగేష్‌ ఆందోళన చెందాడు. అప్పుల విషయం తల్లిదండ్రులకు తెలిసి నిలదీయడంతో.. యోగేశ్‌ భయపడిపోయాడు. చివరకు పురుగుల మందు తాగి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు.



చేతికందిన బిడ్డలు కళ్లముందే పాడు గేమ్స్‌కు బానిసలై ప్రాణాలు కోల్పోతున్నారని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా ఈ కాలం యువత మంచి కంటే చెడుకే ఎక్కువ ప్రభావితమవుతున్నారని.. కొత్తగా వస్తున్న ఎన్నో గేమ్స్ వారిలోని పైశాచికత్వాన్ని నిద్ర లేపుతున్నాయంటున్నారు నిపుణులు.



డాక్టర్స్, నిపుణులు కూడా ఆన్లైన్ గేమ్స్‌కు ఎంతదూరంగా ఉంటే అంత మంచిదని సలహా ఇస్తున్నారు. కేంద్రం ప్రభుత్వం పబ్జీని బ్యాన్ చేసింది. అయితే.. పబ్జీ సైట్‌లో ఈ ఆన్‌లైన్ గేమ్‌ను ఆడేస్తున్నారు యువత. ఇప్పటికైనా ఇలాంటి హింసాత్మక ఆటలను పూర్తిగా నిషేధించాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.