Chandrababu: రాష్ట్రంలో రూ. లక్షన్నర కోట్ల బిల్లులు పెండింగ్, కాంట్రాక్టర్లు విలవిలాడుతున్నారు: మాజీ సీఎం చంద్రబాబు

ప్రభుత్వం టెండర్లు పిలిచి అప్పగించే పనుల తాలూకు బిల్లుల కోసం కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లకూడదని టెండర్లో నిబంధన పెట్టడం సిగ్గుచేటని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Chandrababu: రాష్ట్రంలో రూ. లక్షన్నర కోట్ల బిల్లులు పెండింగ్, కాంట్రాక్టర్లు విలవిలాడుతున్నారు: మాజీ సీఎం చంద్రబాబు

Chandrababu

Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిల్లులు చెల్లింపుపై వైకాపా సర్కారు పాటిస్తున్న విధానంతో గుత్తేదార్లు తీవ్రంగా నష్టపోతున్నారని.. తద్వారా ప్రభుత్వ సంస్థలు, సిబ్బంది ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతోందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ సర్కార్ 3 ఏళ్ల రివర్స్ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం టెండర్లు పిలిచి అప్పగించే పనుల తాలూకు బిల్లుల కోసం కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లకూడదని టెండర్లో నిబంధన పెట్టడం సిగ్గుచేటని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్లను బిల్లుల కోసం కోర్టుకు వెళ్లవద్దు అని టెండర్ డాక్యుమెంట్ లోనే నిబంధన పెట్టడం రాష్ట్ర దుస్థితికి, అసమర్థ పాలనకు నిదర్శనమని ఆయన అన్నారు.

Other Stories: TTD: రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత సామూహిక వివాహాలు.. ఆగస్టు 7 సుముహూర్తం

తాము చేసిన పనిలో బిల్లుల కోసం కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లవద్దు అనే నిబంధన పెట్టడం దేశంలో మరే రాష్ట్రంలోను ఉండి ఉండదన్న చంద్రబాబు..వైకాపా సర్కార్ చర్య రాష్ట్ర పరువు తీసేలా ఉందని..దీనికి ముఖ్యమంత్రి సిగ్గుపడాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా డెల్టా కాలువల మరమ్మతుల టెండర్ లో బిల్లుల కోసం ఒత్తిడి తేవొద్దు అని ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలు రాష్ట్ర పరువు తీశాయని చంద్రబాబు అన్నారు. గుత్తేదార్లకు ప్రభుత్వం బిల్లులు ఇవ్వని కారణంగా నిర్మాణ, వ్యాపార, సేవల రంగంలో లక్షల మంది ఉపాధి కోల్పోవడానికి జగన్ కారణం అయ్యారని చంద్రబాబు మండిపడ్డారు.

Other Stories: CM Jagan in Delhi: 9 అంశాలని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లిన సీఎం జగన్: నేడు అమిత్ షాతో భేటీ

రాష్ట్రంలో ఇప్పటికే రూ. లక్షన్నర కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని..దీని కారణంగా కాంట్రాక్టర్లపై, ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందిపై ఎంత ప్రభావం చూపుతుందో ఈ మూర్ఖపు ప్రభుత్వానికి అర్థం కాదంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘న్యాయం కోసం కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లే హక్కు లేదు’ అనే నిబంధన పెట్టే హక్కు అసలు మీకు ఎక్కడిది? అంటూ అధికార వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. కేవలం రూ. 13 కోట్ల పనులకు ధైర్యంగా టెండర్లు పిలవలేని ఈ ప్రభుత్వం.. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తుందా? ఎయిర్ పోర్ట్ లు, స్టీల్ ప్లాంట్లు నిర్మిస్తుందా? మూడు రాజధానుల కడుతుందా? అంటూ మాజీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.