Girl Attacked Father : ప్రియుడి మాయలో పడి తండ్రిపై కత్తితో దాడి చేసిన బాలిక

విశాఖలో దారుణం జరిగింది. ప్రియుడి మాయలో పడిన ఓ బాలిక తండ్రిపై కత్తి దాడికి పాల్పడింది. బాలిక కత్తితో తండ్రి మెడపై పొడిచింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Girl Attacked Father : ప్రియుడి మాయలో పడి తండ్రిపై కత్తితో దాడి చేసిన బాలిక

ATTACK

girl attacked father : విశాఖలో దారుణం జరిగింది. ప్రియుడి మాయలో పడిన ఓ బాలిక తండ్రిపై కత్తి దాడికి పాల్పడింది. బాలిక కత్తితో తండ్రి మెడపై పొడిచింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కాయపాలెం శంకరమఠంకు చెందిన బాలికకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని యువకుడు బాలికను నమ్మించాడు.

ప్రియుడి మోజులో పడిన బాలిక తన ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలను ఆ యువకుడికి ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి కూతురిని నిలదీశాడు. ఇంట్లో కొన్ని రోజులుగా తండ్రి, కూతురు మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఈ విషయాన్ని బాలిక ఆమె ప్రియుడికి చెప్పింది. తన దగ్గర డబ్బులు లేవని నీవే ఏదో ఒకటి చేయాలని యువకుడు చేతులెత్తేశాడు.

Wife Murder Husband : వామ్మో.. ప్రియుడి మోజులో భర్తను చంపి శవాన్ని ఇంట్లోనే పాతిపెట్టిన భార్య.. నాలుగేళ్ల తర్వాత వెలుగులోకి

దీంతో బాలిక కత్తితో కన్న తండ్రిపై దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన తండ్రి స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు బాలికను అదుపులోకి తీసుకుని విచారించారు.  ఆ యువకుడికి మరొకరితో ప్రేమ వ్యవహారం నడుస్తోందని బాలిక బంధువులు పేర్కొన్నారు.

ఆమె ప్రోద్బలంతోనే డబ్బు కాజేశారని ఆరోపిస్తున్నారు. అయితే, ప్రేమ పేరుతో తనను మోసం చేసి నగదు కాజేశాడని యువకుడిపై పోలీసులకు బాలిక ఫిర్యాదు చేశారు. బాలికను జువైనల్ హోమ్ కు తరలిస్తామని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.