Tirumala-Tirupati : తిరుమల కొండపై వెళ్లేదారి క్లోజ్..భక్తుల ఇక్కట్లు, ఏపీకి భారీ వర్ష సూచన

తిరుమల కొండపైకి వెళ్లే నడకదారిని మూసివేశారు. 2021, నవంబర్ 17వ తేదీ..18వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలతో.. ముందస్తుజాగ్రత్తగా నడకదారిని మూసేశారు.

Tirumala-Tirupati : తిరుమల కొండపై వెళ్లేదారి క్లోజ్..భక్తుల ఇక్కట్లు, ఏపీకి భారీ వర్ష సూచన

Ap Rain

Heavy Rains : తిరుమల కొండపైకి వెళ్లే నడకదారిని మూసివేశారు. 2021, నవంబర్ 17వ తేదీ..18వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలతో.. ముందస్తుజాగ్రత్తగా నడకదారిని మూసేశారు టీటీడీ అధికారులు. భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో భక్తులను కాలినడకన అనుమతించట్లేదు. అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గాలను మూసేయడంతో భక్తులు ఇక్కట్లు పడుతున్నారు.  గత వారంలో కురిసిన వర్షాలకు నడకదారిలో మెట్లపైకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోసారి వర్షాలు పడితే నడకమెట్లపై వరద పోటెత్తనుందని భావించిన అధికారులు.. ఈ దారిని మూసివేశారు.

Read More : UP Election : యూపీ మళ్లీ బీజేపీదే!..ఎస్పీకి సెకండ్ ప్లేస్ తప్పదంటున్న తాజా సర్వే

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఇది గురువారానికి దక్షిణ కోస్తా – ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంగా చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. కోస్తాంధ్ర – తమిళనాడు తీరానికి దగ్గరగా వచ్చే సమయానికి మరింత బలపడే అవకాశముందని వెల్లడించింది. దీని ప్రభావంతో బుధవారం కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమలో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గురువారం, శుక్రవారం కూడా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు తిరుమల ఘాట్‌రోడ్లలో కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. దీంతో ఒక రోజు రాత్రంతా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ రెండు రోజులు కురవనున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడితే…ఎప్పటికప్పుడు రాళ్లను తొలగించేందుకు రెస్క్యూ టీమ్స్‌ సిద్ధంగా ఉన్నాయి.

Read More : Delhi Pollution : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వర్క్ ఫ్రమ్ హోమ్‌‌పై కేంద్రం క్లారిటీ

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ గురువారానికి దక్షిణ కోస్తా – ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంగా చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. కోస్తాంధ్ర – తమిళనాడు తీరానికి దగ్గరగా వచ్చే సమయానికి మరింత బలపడే అవకాశముందని వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమలో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది.