Hijab Row In AP: ఏపీకి పాకిన హిజాబ్ వివాదం..విద్యార్థినిలను అడ్డుకున్న విజయవాడ లయోల కాలేజీ యాజమాన్యం

కర్ణాటకలో మొదలైన ‘హిజాబ్’ వివాదం ఏపీకి కూడా పాకింది. విజయవాడ లయోలా కాలేజీలో హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థినిలను లోపలికి రాకుండా అడ్డుకుంది కాలేజీ యాజమాన్యం.

Hijab Row In AP: ఏపీకి పాకిన హిజాబ్ వివాదం..విద్యార్థినిలను అడ్డుకున్న విజయవాడ లయోల కాలేజీ యాజమాన్యం

Hijab Row In Ap (1)

Hijab Row In AP : కర్ణాటకలో మొదలైన ‘హిజాబ్’ వివాదం చిలికి చిలికి గాలివాన కాదు ఏకంగా తుఫానుగా మారింది. దేశ వ్యాప్త వివాదంగా మారింది. ఈక్రమంలో హిజాబ్ వివాదం ఏపీకి కూడా పాకింది. విజయవాడ లయోలా కాలేజీలో హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థినిలను లోపలికి రాకుండా అడ్డుకుంది కాలేజీ యాజమాన్యం. దీంతో పలువురు ముస్లిం పెద్దలు కాలేజీ వద్దకు చేరుకున్నారు.

Hijab Row: ‘మేలి ముసుగు, తలపాగాలకు లేనిది హిజాబ్‌కు అనుమతివ్వరా’

జాతీయ వ్యాప్తంగా సంచలనంగా మారిన హిజాబ్ వివాదం తెలుగు రాష్ట్రాకు పాకింది. ఇప్పటికే ఈ వివాదం కర్ణాటక హై కోర్ట్ లో విచారణ కొనసాగుతున్న క్రమంలో ..తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో కూడా హిజాబ్ వివాదం చెలరేగింది. విజయవాడలోని లయోల కాలేజీలో హిజాబ్ (బుర్ఖా) ధరించి కాలేజీకి వచ్చిన విద్యార్థినిలను కళాశాల యాజమాన్యం లోపలికి రావటానికి అనుమతించలేదు. దీంతో వివాదం చెలరేగింది.

Also read : Hijab Row: ‘హిజాబ్‌ను బహిరంగ ప్రదేశాల్లో వేసుకుంటే ఊరుకోం’

ఫస్ట్ ఇయర్ లో కూడా బుర్ఖాతోనే తరగతులకు హాజరయ్యామని..ఇప్పుడే ఎందుకు అడ్డుకుంటున్నారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. మాకు కాలేజీ యాజమాన్యం ఇచ్చిన ఐడీ కార్డుల్లోనూ హిజాబ్ తోనే ఫోటో దిగామని..ఇప్పటి వరకు లేనిది ఇప్పుడే ఎందుకు దీన్ని సమస్యగా మార్చి మమ్మల్ని అడ్డుకుంటున్నారని విద్యార్థినులు ప్రశ్నిస్తున్నారు. గతంలో లేనిది ఇప్పుడెందుకు వస్తుంది? అంటూ విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా వాపోతున్నారు. దీంతో ముస్లిం మతపెద్దలు కళాశాల వద్దకు వచ్చారు. తల్లిదండ్రులు కళాశాల ప్రిన్సిపల్ తో చర్చలు జరుపుతున్నారు.

Read Also: ‘మేలి ముసుగు, తలపాగాలకు లేనిది హిజాబ్‌కు అనుమతివ్వరా’

కాగా కర్ణాటకలో కొన్ని వారాల క్రితం ఓ కాలేజీలో ముస్లిం విద్యార్థినిలు హిజాబ్ ధరించి వస్తుండటంతో కాలేజీ యాజమాన్యం అడ్డుకుంది. హిజాబ్ తీసివేస్తేనే లోపలికి అనుమతి ఇస్తామని తేల్చి చెప్పింది.దీంతో హిజాబ్ అనేది మా సంప్రదాయం ఇది హక్కు ఇంతకాలంగా లేనిది సడెన్ గా ఇప్పుడు ఇటువంటి ఆంక్షలు పెట్టటం సరికాదని వాదిస్తున్నారు.

Also read : Hizab Row : హిజాబ్‌ ధరించిన అమ్మాయి ఏదోకరోజు భారత్ ప్రధాని అవుతుంది..ఇది రాసిపెట్టుకోండీ : అసదుద్దీన్ ఒవైసీ

ఈక్రమంలో హిజాబ్ ధరించిన విద్యార్ధినిలకు వ్యతిరేకంగా మరో వర్గం విద్యార్థులు కాషాయ కండువాలతో రావడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికీ రోజుకో కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ వివాదం ఇతర రాష్ట్రాలకు కూడా పాకుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి.