Hijab Row: ‘హిజాబ్‌ను బహిరంగ ప్రదేశాల్లో వేసుకుంటే ఊరుకోం’

హిజాబ్ ధరించి విద్యాసంస్థలకు వస్తామని ముస్లిం స్టూడెంట్స్ అడిగిన రిక్వెస్ట్ పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అదే సమయంలో దేశవ్యాప్తంగా పలువురు నేతలు కామెంట్లు చేస్తూనే ఉన్నారు.

Hijab Row: ‘హిజాబ్‌ను బహిరంగ ప్రదేశాల్లో వేసుకుంటే ఊరుకోం’

Hijab Row: హిజాబ్ ధరించి విద్యాసంస్థలకు వస్తామని ముస్లిం స్టూడెంట్స్ అడిగిన రిక్వెస్ట్ పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అదే సమయంలో దేశవ్యాప్తంగా పలువురు నేతలు కామెంట్లు చేస్తూనే ఉన్నారు. మాలెగావ్ బ్లాస్ట్స్ ఘటనలో నిందితురాలైన బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ ధరించి తిరిగితే ఊరుకునేది లేదు’

‘హిజాబ్ ధరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హిందువులు మహిళలను పూజిస్తారు. ఎవరికైతే ఇళ్లల్లో సేఫ్టీ దొరకదో వాళ్లు మాత్రమే ఇంటిలో హిజాబ్ ధరించాలి’

‘ఎక్కడైనా హిజాబ్ ధరించాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఇళ్లలో సేఫ్టీ ఉండదో అక్కడే ధరించండి. మీకు మదరసాలు ఉన్నాయి కదా. అక్కడ ధరిస్తే మేం ఏం చేయలేం. అదే బహిరంగ ప్రదేశాల్లో.. హిందూ సమాజం ఉన్న చోట అవసరం లేదు’ అని భోపాల్ లోని ఓ గుడి వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

Read Also: ‘మేలి ముసుగు, తలపాగాలకు లేనిది హిజాబ్‌కు అనుమతివ్వరా’

‘హిజాబ్ అనేది ఒక ముసుగు. చెడు చూపు పడకుండా ఉండాలని మాత్రమే ధరించాలి. కానీ, హిందువులు అలా ఉండరు. స్త్రీలను పూజిస్తారు. మీ ఇళ్లలో ధరించండి హిజాబ్’ అని కామెంట్ చేశారు ఎంపీ ప్రగ్యా.

హిజాబ్ ధరించడంపై కర్ణాటక హైకోర్టులో విచారణ జరుగుతున్నంది. దీనిపై తీర్పు వచ్చేంత వరకూ క్లాసుల్లో ఎటువంటి మతపరమైన దుస్తులు ధరించకూడదని కోర్టు ఆదేశాలిచ్చింది.