Dharmavaram : భార్య లాంగ్ చైన్ మింగేసిన భర్త.. మూడు నెలలుగా కడుపులోనే.. చివరికి ఏం జరిగిందంటే?

చివరకు బాధితుడు మాట్లాడలేని స్థితికి చేరుకున్నాడు. బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిలో బాధితుడిని పరిశీలించిన వైద్యులు షాక్ కు గురయ్యారు.

Dharmavaram : భార్య లాంగ్ చైన్ మింగేసిన భర్త.. మూడు నెలలుగా కడుపులోనే.. చివరికి ఏం జరిగిందంటే?

Man Swallow Chain

Updated On : June 1, 2023 / 8:55 PM IST

Man Swallow Long Chain : శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో విచిత్ర మైన ఘటన చోటు చేసుకుంది. భార్య లాంగ్ చైన్ ను భర్త మింగేశారు. ధర్మవరం పట్టణం రాజేంద్ర నగర్ కు చెందిన రామాంజనేయులు భార్య లాంగ్ చైన్ ను మింగేశారు.

మూడు నెలలుగా లాంగ్ చైన్ కడుపులోనే ఉంది. దీంతో గత కొన్ని రోజులుగా రామాంజనేయులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  చివరకు బాధితుడు మాట్లాడలేని స్థితికి చేరుకున్నాడు.

Nampally Court : జైలుకు వెళ్లనంటూ నాంపల్లి కోర్టులో నిందితుడు హల్ చల్

బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిలో బాధితుడిని పరిశీలించిన వైద్యులు షాక్ కు గురయ్యారు. ఆపరేషన్ చేసి బంగారం చైన్ తీయాలని డాక్టర్లు చెప్పారు. డబ్బు పెట్టుకునే స్థోమత లేక బాధితుడు ప్రభుత్వాసుపత్రికి వెళ్లాడు.

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చిన్న కుట్టుకూడ లేకుండా చైన్ బయటకు తీశారు. ఎలాంటి ఆపరేషన్ లేకుండా నోటి ద్వారానే డాక్టర్ సుకుమార్ చైన్ తీశారు. వైద్యుల చొరవకు బాధితుని కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు.