Herd Of Elephants : పొలాలపై ఏనుగుల గుంపు దండయాత్ర.. వందల ఎకరాల్లో పంటనష్టం

చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులు పెరిగిపోయాయి. ఏనుగుల గుంపు పొలాలపై పడి పంటనష్టం కలిగిస్తున్నాయి. వాటిని మళ్లించేందుకు వెళ్లిన వారిపై దాడి చేసి హతమార్చుతున్నాయి.

Herd Of Elephants : పొలాలపై ఏనుగుల గుంపు దండయాత్ర.. వందల ఎకరాల్లో పంటనష్టం

Herd Of Elephants

Herd Of Elephants : చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులు పెరిగిపోయాయి. ఏనుగుల గుంపు పొలాలపై పడి పంటనష్టం కలిగిస్తున్నాయి. వాటిని మళ్లించేందుకు వెళ్లిన వారిపై దాడి చేసి హతమార్చుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో ఇటువంటి ఘటనలు చాలానే జరిగాయి. అయితే ఆదివారం ఉదయం గుంపులుగా వచ్చిన ఏనుగులు పంటపొలాలను నాశనం చేశాయి.. కొబ్బరి చెట్లను నేలమట్టం చేశాయి. ఏనుగుల గుంపు వందలాది ఎకరాల్లో పంటలను ధ్వంసం చేశాయి.

చదవండి : Elephants Damage Crops : గజరాజుల బీభత్సం.. మూడు గ్రామాల్లో పంట నష్టం

చిత్తూరు జిల్లా రామపకుప్పం మండలంల సింగసముద్రంలో ఏనుగులు పంటపొలాలపై దాడి చేశాయి. కొబ్బరి చెట్లను పూర్తిగా నేలమట్టం చేశాయి. బీన్స్‌, టమోటా పంటలను తొక్కిపడేశాయి. ఏనుగుల గుంపు చేతికొచ్చిన పంటను నాశనం చేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల దాడుల నుంచి తమ పొలాలకు విముక్తి కలిగించాలని అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఏనుగులు తమ పొలాలు నాశనం చేసి పక్కనే ఉన్న చెరులో పడుకుంటున్నాయని చెబుతున్నారు. వెంటనే వాటిని అడవుల్లోకి తరమాలని అధికారులను వేడుకుంటున్నారు రైతులు.

చదవండి : Elephants Ettack :రెచ్చిపోయిన ఏనుగులు.. బీజేపీ నాయ‌కుడిని తొక్కి చంపేసాయి..